ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.ఎదురుగా దిగాలుగా చదువుల తల్లి సరస్వతీదేవి
రెండుచేతులు జోడించాను ” సృష్టిని యావత్తు నీ చల్లని చూపులతో నీ విద్వత్తుతో తీర్చిదిద్దే నువ్వే ఇలా దిగాలుగా ఉన్నావా? అని అడిగాను
” ప్రతీచిన్నారి చదువుల్లో ఎదిగి ప్రపంచానికి కొత్తవెలుగులు పంచాలనుకున్నాను.కానీ నా ఒడిలో అక్షరాలు దిద్దే చిన్నారులు బాల్యంలోనే దారి తప్పుతున్నారు.ఎవరూ ఆలోచించడం లేదు..ఎటు పోతుంది చిన్నారుల ప్రపంచం? ప్రశ్నంచింది ఆవేదనగా.
చదువులతల్లి ఆవేదనలో అంతరార్థం అర్థమైతే మనసు చెమ్మగిల్లుతుంది.కర్తవ్యం బోధపడుతుంది.
బాలల దినోత్సవం ఒక్కరోజు పండుగేనా? పోలీసులు కోర్టులు నేరాలు ఘోరాలు కాలుష్యం…వాతావరణమే కాదు మనుషుల్లోని మానవత్వం సైతం కాలుష్యంగా మారుతుంది.
ఒక పూలమొక్క నాటితే పరిమళాలు వెదజల్లుతుంది
ఒక ఫలవృక్షాన్ని నాటితే మధురఫలాలు ఇస్తుంది
ఒక మొక్క వృక్షమై,మహా వృక్షమై ఎందరికో నీడను ఇస్తుంది.
చెట్లు ప్రాణాధారమై నిలుస్తాయి.
ఆ చెట్లు చేయగలిగే పనులు ప్రాణం ఉండి,విజ్ఞత ఉండి ,స్వరం ఉండి ,మెదడు ఉండి ఏమీచేయలేక మిన్నకుండి పోతున్నామా ?
రేపటి సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏమిటి?
ఈ దేశానికి మనం అందించే కానుక ఏమిటి?
విద్యార్థిదశలోనే పాఠశాల ప్రాంగణంలోనే మనం విద్యార్థులు భవిష్యత్తును అత్యద్భుతంగా తీర్చిదిద్దలేని నిస్సహాయతకు బాధ్యులెవరు ?
సాంకేతికంగా ఎంత ఎదిగినా మానవత్వం దిగజారిపోతుందన్న నిష్టుర నిజాన్ని కాదనగలమా?
దేశం ఎదగాలంటే,ప్రగతిపథం వైపు నడవాలంటే రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే బాలల ఎదుగుదల ప్రవర్ధమానం కావాలి.
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం పౌరసమాజం ఒక్కతాటిపై నిలవాలి.
కేవలం ఒకేఒక్కరోజు బాలల దినోత్సవం కాదు ప్రతిరోజూ పండుగే కావాలి.ప్రతీ చిన్నారి భవిష్య్తతు ఉజ్వలంగా ఉండాలి.
నా విద్యాసంస్థ ప్రాంగణంలో నుంచి బయటకు వెళ్లే విద్యార్ధి …
ఒక ఉపాధ్యాయుడు ,ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ న్యాయాన్ని కాపాడే న్యాయవాది,చట్టాన్ని కాపాడే రక్షకుడు,దేశాన్ని ముందుకు నడిపించే స్వచ్ఛమైన నాయకుడు కావాలి.
ప్రతీచిన్నారి రేపటి భవిష్యత్తుకు ఒక వెలుగురేఖగా మారాలి.
ఇదే నిజమైన బాలల దినోత్సవానికి నేనిచ్చే నిర్వచనం
ఇదే నా ఆకాంక్ష.
బాలల దినోత్సవ శుభాకాంక్షలతో
మీ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్