ఒక అమాయపు ఆడకూతురి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది
మరణానికి ముందు ,తనపై జరిగే దారుణాన్ని చూస్తూ నిస్సహాయంగా అరిచిన అరుపులు
హృదయవిదారక ఆర్తనాదాలు కంటతడిపెట్టాయి.
ఒక ప్రియాంక రెడ్డి
ఒక మానస
ఇలా ఎందరెందరో కర్కశ మృగాళ్ల చేతిలో బలైపోతున్నారు.
నిందితులకు బహిరంగ ఉరికుడా తక్కువే
భయంకరమైన జంతువులు సంచరించే కీకారణ్యంలో క్రూరజంతువుల మధ్య వదిలివేయాలి
సాంఘీక బహిష్కరణ జరగాలి.
మానవతావాది డాక్టర్ విష్ణుశ్రీభాష్యం ఆవేదన
ఆక్రందన …ఆవేదన…దయనీయం…అమానవీయం….. ఏదీ అమ్మలకి రక్ష????
వేయరా ఈ కామాంధ రక్కసులకి శిక్ష….. పాపం తల్లి… ఆ సమయంలో ఎంత చిత్ర వధ అనుభవించిందో…
ఏ ప్రమాదం గురించి బాధతో భావించిందో….. దేవుడా…. వద్దు…. నీకే దయ లేనప్పుడు… ఎందుకు సృష్టించేవ్ స్త్రీ జాతిని….ఈ పాఖండులతోనే, ఈ పాశండు లతోనే ఆపేయ్…. కాలాన్ని…. ఇక నీలో కలుపుకోవడానికే కల్పించు.. ప్రళయాన్ని.
ఈ జాగ్రత్తలు పాటించండి
* హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది. వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది.
నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. ఈ యాప్‌తోపాటు డయల్ ‘100’, వాట్సాప్ (హైదరాబాద్: 9490616555, సైబరా బాద్: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు.
నిరంతర పర్యవేక్షణ…
పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని నిరంతరం పర్యవేక్షి స్తుంటాం. మహిళల కోసం ఏర్పాటు చేసి న విభాగాలను ఐటీ సెల్‌లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటా రు. ఈ యాప్ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. – ఐటీ సెల్ అధికారులు