మే 25 ( మేన్ రోబో బ్యూరో)
ఔత్సాహికులైన రచయితలకు కహానియా ఆహ్వానం పలుకుతుంది.కథలు రాయాలనే ఆసక్తి ఉండి ,ఆ కథలను స్వంతంగా పబ్లిష్ చేసుకోలేక,పత్రికల్లో వేస్తారో లేదోనన్న సందేహం,కొత్తవాళ్లకు పారితోషకం ఇస్తారా? ఇలా సవాలక్ష సందేహాలు,సరైన ప్రోత్సహం లేక తమ ఇష్టాన్ని మనసులోనే దాచేసుకునే వారికి కహానియా ఆహ్వానం శుభారంభం.
ఇప్పటికే వేలాది కథలు సీరియల్స్ కహానియాలో కొలువుతీరాయి.
ప్రముఖరచయితలు మొదలు కొత్త రచయితల కథల వరకూ విస్తరించి పాఠకుల ఆదరణ చూరగొంటుంది.
రచయితలు రాసే కథలకు తగిన పారితోషికం ( రాయల్టీ) కూడా అందిస్తుంది.ఒక్కసారి కహానీయాలోకి లాగిన్ అయి,అందులో వస్తున్న రచనలను పరిశీలించి,మీలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకుని మంచి కథలను కహానియా కోసం రాయండి.
హారర్ క్రైమ్ రొమాన్స్ మానవ సంబంధాలు కామెడీ..సబ్జెక్టు ఏదైనా పాఠకులను మెస్మరైజ్ చేయగలిగితే చాలు
మీ టాలెంట్ ను ప్రపంచవ్యాప్తంగా వున్న కహానియా పాఠకులు చూసే అవకాశం వుంది.మీ కథలకు పారితోషికం కూడా అందుకోవచ్చు.
పల్లవ్ బజ్జూరి ఆలోచనల్లో సరికొత్త మార్పులతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కహానియా , పాఠకులకు రచయితలకు మధ్య ఒక అద్భుతమైన వేదిక
కహానియా తెలుగు విభాగానికి ఎడిటర్ లక్ష్మి పెండ్యాల
డియర్ రైటర్స్ ..
ఇక మీదే ఆలస్యం
బెస్ట్ అఫ్ లక్
మీ కోసం కహానియా లింక్