ఏప్రిల్ 29 (మేన్ రోబో బ్యూరో )
లాక్ డౌన్ లో ప్రపంచం విషాదంలోకి నెట్టివేయబడింది.కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాం.మనం జనం ఒక్కటవ్వాలి.కరోనాను తరిమివేయాలి.ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ,రచయిత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మేన్ రోబో బ్యూరోతో తన అభిప్రాయాలూ పంచుకున్నారు .
తన మనసులోని మాట …
‘ కరోనా వైరస్ మీద మనమంతా యుద్ధం చేయాలి.ప్రభుత్వం.పోలీసులు వైద్యులు పారిశుధ్య కార్మికులు సామాజిక సేవాకార్యకర్తలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు.వారికీ చేతులెత్తి నమస్కరిద్దాం.ఈ సమయంలో ఒక విద్యావేత్తగా ఒకమాట.
నాకు విద్యార్థులు ఉపాథ్యాయులు రెండు కళ్లు.ఈ సమయంలో ..ఈ కష్టసమయంలో ఉపాధ్యాయులకు ఆర్థికంగా అండగా ఉండాలి .వారికీ వేతనం చెల్లించాలి,వారికీ పూట గడవాలి.కానీ ఎలా? లక్షల్లో డొనేషన్స్ వసూలు చేసే కార్పొరేట్ స్కూల్స్ సంగతి వదిలేస్తే ఒక నిబద్దతతో,విద్యార్థులు భవిష్యత్తు ధ్యేయంగా ,ఇన్నోవేటివ్ మెథడ్స్ తో విద్యార్థులను తీర్చిదిద్దుతూ,క్రమం తప్పకుండా ఆర్థిక కష్టాలకు వెరవకుండా వేతనాలు చెల్లించే కొద్దిపాటి విద్యాసంస్థలు ఇప్పుడు కష్టాల్లో నష్టాల్లో పడిపోయాయి.ఆర్థిక చట్రంలో చితికిపోతోంది.ఎందుకంటే పదుల సంఖ్యలో వున్న ఉపాథ్యాయులకు సిబ్బందికి లక్షలాది రూపాయలు వ్యక్తిగతంగా చెల్లించడం సాధ్యమయ్యే విషయమా? ఆలోచించండి,
ఈ విషయంలో పేరెంట్స్ కూడా పెద్దమనసుతో ఆలోచించాలి .ఇన్నాళ్లూ తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాసంస్థ మనుగడ గురించి,మేముమీ వెంట ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి.
ఇది మీ విద్యాసంస్థ .
తమ పిల్లలకు పాఠాలు నేర్పిన ఉపాథ్యాయుల గురించి వారి కుటుంబాల గురించి ఆలోచించాలి.ఫీజులో కొద్దిమొత్తమైనా చెల్లించాలి.ఎందుకంటే మీరు చెల్లించే ఫీజుతోనే విద్యాసంస్థలు ఉపాథ్యాయులు ఆధారపడి వుంటారు.ఈ కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవాలి.గురుదేవోభవ అని స్మరించుకునే మనం ,మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉత్తమ విద్యాసంస్థలకు ఉపాధ్యాయులకు మనమే ధైర్యం అవ్వాలి …జై హింద్
లాక్ డౌన్ సమయంను మీ పిల్లలతో గడపండి.ఆటపాటలతో పాటు మన సంస్కృతీ ,సంప్రదాయాల గురించి తెలియజేయండి,
సదా మీ సేవలో,..
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి