స్వరవిలాపం ..మూగబోయిన స్వరం..అమరలోకానికేగిన బాలు గళం ఆ గొంతులోని మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్ష పడుతుంది.తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది..

ఆ గొంతులోని మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్ష పడుతుంది.తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది..ఆ గళం బాలు స్వంతం.ఎందరికో గాత్రదానం చేసారు.ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు.
కోట్లాది గొంతుకలలో దుఃఖాన్ని
తన జ్ఞాపకంగా వదిలి భౌతికంగా నిష్క్రమించిన
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం కంటతడి పెట్టింది
కోకిలస్వరం మూర్ఛిల్లింది.
అమరగానం తల్లడిల్లింది
పాటలు అనాథలయ్యాయి
పల్లవించిన చరణాల పూలతోట
మాలి లేక విలపిస్తోంది.
వేనవేల పాటలు కన్నీటిసంద్రమయ్యాయి
మనలో పాటగా మిగిలిన బాల గంధర్వుడికి
మనసా స్మరామి
బాలూ..
మీరు చిరస్మరణీయులు
మీ గళంలో పాట పునీతమైంది
మీ స్వరంలో సంగీతం చిరంజీవి అయ్యింది.
…విజయార్కె

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY