నాటకాలకు ఊపిరి పోస్తూ తెలుగు కళాసమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో 2020 ,21 ,22 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన నాటికల పోటీల్లో బహుమతి పొందిన రచయితలకు తెనాలిలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం సభలో బహుమతులు అందజేశారు.
ప్రముఖ రచయిత విజయార్కె సాక్షిలో రాసిన విలువ ( 2020 సంవత్సరానికి )
ప్రేమతో నాన్న( స్వాతిలో సాహస కథల్లో బహుమతి పొందిన కథ )( 2022 సంవత్సరానికి )
నాటక పోటీల్లో ప్రథమ బహుమతి పొందాయి.
ప్రముఖ నాటక రచయిత రావి నాగేశ్వరావు నాటకీకరణ చేశారు.
నాటికల పోటీలకు ఎంపికైన 30 మంది రచయితలకు బహుమతులు అందజేశారు.
బహుమతి ప్రధానోత్సవం సభలో ప్రముఖ రంగస్థల నటులు,దర్శకులు డాక్టర్ డి.ఎస్. ఎన్ ,మూర్తి,భారతీయ కళార్చన వ్యవస్థాపకుడు ఈదర హరిబాబు ,రాష్ట్ర నాటక పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు .కె.వి.బలరామ మూర్తి .కావూరి సత్యనారాయణ .జనాబ్ షేక్ జానీ భాషా తదితరులు పాల్గొన్నారు
సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.