ఉపాసన గ్రేట్ ,,,అనుబంధాల మెగా లోగిలిలో అడుగుపెట్టనున్న మెగా ఉపాసన.వీడియో చూడండి..

(మేన్ రోబో ) జూన్ 16

గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ  మా బిడ్డ మిస్ అవ్వకూడదు…ఉపాసన
పెళ్లి కాగానే అత్తమామల నుంచి విడిపోయి,పిల్లలు పుట్టగానే గ్రాండ్ పేరెంట్స్ ను తమ పిల్లలకు దూరం చేసేవారికి ఉపాసన నిర్ణయం ఒక పాఠం.చెంపపెట్టు.ఒక ఆదర్శం.
ఒక భార్యగా,తల్లిగా,కోడలిగా ఉపాసన నిర్ణయం హేట్సాఫ్
ఇక అసలు విషయానికి వస్తే,ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్.ఈ సందర్భంగా ఒక గొప్ప అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఉపాసనా  రామ్ చరణ్.
” పిల్లలు పుట్టగానే అత్తమామల  నుంచి విడిపోయి వేరు కాపురం పెడతారు.కానీ,మేము భిన్నంగా నిర్ణయించుకున్నాం.బేబీ పుట్టాక మా అత్తమామలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం..మా పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ దూరం కాకూడదు.మేము ఆ ప్రేమతోనే పెరిగాం.ఎన్నో విషయాలు మా గ్రాండ్ పేరెంట్స్ ద్వారా తెలుసుకున్నాం.ఇప్పుడు మా బిడ్డ కూడా అలాగే పెరగాలి గ్రాండ్ పేరెంట్స్ ద్వారా పొందే ఆనందం ఎఫెక్షన్ మా బిడ్డకు దూరం కాకూడదు .” అని అన్నారు ఉపాసన.
ఎంతమంది కోడళ్ళు ఇలా ఆలోచిస్తారు.ఒక అనుబంధాల లోగిలిలోకి అడుగుపెట్టాలన్న మీ నిర్ణయం ఒక కుటుంబ కథా చిత్రమే కాదు..ఎందరికో స్ఫూర్తి నిచ్చే విషయం.
మెగాస్టార్ ఇంటి కోడలిగా మెగా కోడలిగా మీరు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని మేన్ రోబో కోరుకుంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY