కబాలి నాకు నచ్చింది …. క్రిటిక్స్ ఈ సినిమాకి 1.5 రేటింగ్ ఇవ్వడం దారుణమని నా అభిప్రాయం.రమా కంభంపాటి

  (సినిమాకు ప్రతీ ప్రేక్షకుడూ ఒక క్రిటిక్కే…సినిమా కొందరికి నచ్చుతుంది…కబాలి సినిమా గురించి రమా కంభంపాటి అభిప్రాయాన్ని మేన్ రోబో పాఠకుల కోసం అందిస్తున్నాం…మీ స్పందన కూడా తెలియజేయవచ్చు…చీఫ్ ఎడిటర్)
(రమా కంభంపాటి)
కబాలి చూశాను.చాలా నచ్చింది. మలేషియాలో భారతీయుల కష్టాలు, వందల ఏళ్ళ క్రితం వలస వెళ్ళిన తమిళుల సమస్యలు, వారిపై వివక్ష.. ఆ వివక్షలోంచి పుట్టుకొచ్చిన విప్లవం..కాల క్రమంలో గ్యాంగులుగా మారిన దాని రూపం..ఆ గ్యాంగుల్లో ఆధిపత్య పోరు, వెన్నుపోట్లు..రక్తంతో తడిసిన చేతులు..దూరమైన రక్త సంబంధాలు.. అభివాదం, భాష, పుట్టుక-మరణం, ప్రతీకారంలో కూడా కనిపించిన మలేషియా సంస్కృతి..చివర్లో ఇండో-ఫ్రెంచ్ స్నేహ బంధం..మలేషియా టవర్స్ సాక్షిగా రజనీ హీరోఇజం..రాధికా ఆప్టే కళ్ళలో కరిగిపోయిన ఆ మగతనం..తుపాకుల మోతలో తండ్రి కోసం కూతురి ఆరాటం..పాతికేళ్ళ తర్వాత కూతుర్ని చూసి ఆ తండ్రి కళ్ళలో గర్వం..ఇంకంటే ఒక సినిమాలో ఇంకేమి ఉండాలి?
నాకు ఎక్కడా సినిమాలో బోరు కొట్టలేదు. డ్రగ్స్, వ్యభిచారం, గ్యాంగ్లు, దాడులు, ప్రతి దాడులు, భారతీయులపై వివక్ష, థాయ్, మలేషియాల్లో సర్వ సాధారణం. ఈ సబ్జేక్ట్ చేసిన రజనీ, డైరెక్టర్ ప.రంజిత్లను అభినందించాలి. అసలు ఏ మాత్రం సినిమా పరిజ్ఞానం లేని నాకే ఇది అర్థమయ్యింది.

అలాంటిది కొందరు క్రిటిక్స్ ఈ సినిమాకి 1.5 రేటింగ్ ఇవ్వడం దారుణమని నా అభిప్రాయం.
కొన్ని లోపాలు ఉన్నాయి. ఉంటాయి కూడా! అమృత సినిమాలో మణిరత్నం శ్రీలంకలో తమిళుల పోరాటాన్ని చూపించారు. కబాలిలో మలేషియాలో తమిళుల సమస్యలను స్పృశించారు.
గల్ఫ్ లో భారతీయులు నీచంగా బతుకుతున్నారు. ఇండియా బోర్డర్ దాటితే నిత్యం బతుకు పోరాటమే. బతకడానికి పోరాటం వేరు! కానీ బంగ్లా, శ్రీలంక, దుబాయ్, టర్కీ సిరియా, ఇరాక్, పాక్, ఆఫ్ఘన్ ఇలా అనేక దేశాల్లో బతుకే ఒక పోరాటం. ఇది అర్థం చేసుకోవాలి. తీరిక ఎక్కువై తిక్క రివ్యూస్ కట్టిపెట్టాలి.
ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళాలంటారు. పక్కన మలేషియాలో భారతీయుల పెయిన్ కూడా అర్థం చేసుకోరు. ఇదేమిది?

సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు. సినిమా భిన్న సంస్కృతుల వారధి. సమస్యలను స్పృశించే ఆలోచనా “మంచిది”….

NO COMMENTS

LEAVE A REPLY