ఒక అనువాద చిత్రం
పేరున్న గొప్ప నటీనటులు లేరు
పెద్ద పబ్లిసిటీ లేదు…వందల థియేటర్స్ లో విడుదల కాలేదు…కానీ…
(మధుప్రియ)
ఒక అనువాద చిత్రం
పేరున్న గొప్ప నటీనటులు లేరు
పెద్ద పబ్లిసిటీ లేదు…వందల థియేటర్స్ లో విడుదల కాలేదు..కానీ సైలెంట్ గా ఇరవై అయిదు కోట్ల మైలురాయి దాటింది.ముప్పయికి చేరువలో ఉందని సమాచారం.ఒక అనువాద చిత్రం ఇంతలా వసూలు చేయడం విచిత్రమే.అయితే …
సినిమాలో మంచి డ్రామా వుంది.ఎమోషన్స్ వున్నాయి.మిరుమిట్లు గొలిపే సెట్లు,విదేశాల్లో డ్యూయెట్ లు కాకుండా మనసును హత్తుకునే ట్రీట్మెంట్ వుంది.
“ఏ సినిమా టికెట్ దొరక్క బిచ్చగాడు చూసాను.ఆ తరువాత మరో రెండు స్టార్ సినిమాలు వచ్చినా మా ఫ్రెండ్స్ కు,బిచ్చగాడు చూడమని చెప్పాను”సాఫ్ట్ వేర్ లో పనిచేసే సత్య మాటలు.
“నాక్కాబోయే గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్ళాను…ఫీల్ గుడ్ మూవీ కి కరెక్ట్ అర్థం “విశ్వ అనే కుర్రాడు చెప్పాడు.
“మా అమ్మానాన్నలకు నేనుఇచ్చిన షష్టిపూర్తి గిఫ్ట్”చక్రవర్తి (35)మాటల్లో …
ఎవరన్నారు…కోట్లతోనే సినిమా తీయాలని….?
ఎవరన్నారు…ఫారిన్ లొకేషన్స్ ,స్టార్స్ మాత్రమే సినిమాలో ఉండాలని…?
ఎవరన్నారు సినిమాలకు కథల్లేవని…?
బిచ్చగాడు సినిమా చూసి చెప్పండి.