దుబాయ్ మిలటరీ క్యాంపు…
శత్రుభయం లేకపోయినా కట్టుదిట్టంగా ఉంది సెక్యూరిటీ. అగస్త్యకు అప్పుడే మెలుకువ వచ్చింది..
చుట్టూ చూశాడు. తాళ్ళతో గట్టిగా కట్టడం వల్ల కదలడం సాధ్యం కాలేదు. చేతులు మంట పుడుతున్నాయి.
గంట భారంగా గడిచింది. ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది. బయట కలకలం ప్రారంభమైంది.
అగస్త్యకు పరిస్థితి అర్థం అయ్యింది డస్ట్ స్టార్మ్… ఇసుక తుఫాన్… మామూలు తుఫాన్ కన్నా భయంకరమైంది.
ఇసుకను ఇరవైవేల అడుగుల ఎత్తుకు తీసుకుపోగల కెపాసిటి ఉన్న తుఫాన్.
అగస్త్య టెంట్ ముందు ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తలో దిక్కుగా పారిపోయారు. కాసేపటి తరువాత ట్రక్స్ బయలుదేరిన శబ్దం వినిపించింది. అగస్త్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలచుకోలేదు.
ఒక్క జంప్ లో టెంట్ బయటపడ్డాడు. చుట్టూ ఎడారి… మధ్యలో మిలటరీ బేస్. టెంపరరీ సెట్ అప్…
పది పన్నెండు టెంట్స్ వేసి ఉన్నాయి.