(కొన్ని ఆచారాలను పద్దతులను సైన్స్ రీత్యా ,లాజిక్ రీత్యా ఆలోచిస్తే అర్థాలు పరమార్థాలు తెలుస్తాయి.మనలోని తార్కిక జ్ఞానాన్ని పెంచుతాయి–చీఫ్ ఎడిటర్ )
కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని.
కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే –
*లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని.
*తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం.
*కొబ్బరి బయటిభాగం మన శరీరమని,
* లోపలభాగం మన మనస్సని,
*మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు.
అలానే, కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా,
గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా,
లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశదీకరిస్తూ,
మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమే.
–వెంకట మధు
*ఇలాంటి విశేషాలను మీరు కూడా పంపించవచ్చు —చీఫ్ ఎడిటర్