క్విక్ గా రియాక్ట్ అయిన గ్యాంగ్ తమ దాడిని ప్రారంబించింది…స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (14-08-2016)

హిమాంషుకి షార్ప్ షూటర్ అని మరో పేరు. ఎంత దూరంలోని లక్ష్యాన్నైనా అవలీలగా టార్గెట్ చేస్తాడు. గురి తప్పదు.
ఆకాశం నుండి ముప్పు తొలగిపోగానే టీం మొత్తం ఒక్కసారి రిలాక్స్ అయ్యారు.
సత్యమూర్తిని సెంటర్ సీట్ లోకి లాగి విండో సీట్స్ కవర్ చేశారు హిమాంషు, ఖలీల్.
అగస్త్య బ్యాక్ సీట్ లోకి జంప్ చేశాడు. విండోస్ ఓపెన్ చెయ్యగానే ఒక్కసారి వేడిగాలి కర్ లోకి దూసుకువచ్చింది. ¬అప్పటివరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారి వేడిగాలితో నిండిపోయింది.
“హిమా! గెట్ రెడీ” అంటూ అగస్త్య పొజిషన్ తీసుకున్నాడు.
శత్రువులు రెండు నిముషాలలో టార్గెట్ లోకి వచ్చారు.
మొత్తం 25 వెహికల్స్ ఉన్నాయి. అందులో 15 బైక్స్. మిగిలినవి డెజర్ట్ సఫారి వాహనాలు.
అగస్త్య టీంలో ఎవ్వరూ తొందరపడలేదు.
శత్రువుల వెహికల్స్ వచ్చే తీరు చూస్తే డ్రైవర్స్ వాహనాలు నడపడంలో ఆరితేరిన వాళ్ళలా కనిపించారు.
డెజర్ట్ సఫారి వాహనాలను టార్గెట్ చెయ్యడం చాలా కష్టం. వెహికల్స్ తిన్నగా నడపరు. ఇసుక దిబ్బలపై చిత్రవిచిత్రంగా తిప్పుతారు. షూట్ చెయ్యడం చాలా కష్టం.
“బ్రో… సఫారి వెహికల్స్ లో ఉన్న మా ఫ్రెండ్స్ ని నాకు వదిలేయండి. మిగిలిన వారిని మీరు చూసుకోండి” అంటూ హిమాంషు గన్ ఐం చేశాడు.
హిమాంషు ఫస్ట్ షాట్…
అతని ఆలోచనలను పసికట్టిన దానిలా బులెట్ గురి తప్పకుండా వెళ్లి వరుసలో ముందుగా జంప్ చేస్తున్న సఫారి వెహికల్ టైర్ లో దిగబడింది.
అంతవరకూ చిత్ర విచిత్రంగా గంతులేస్తూ ఉన్న వెహికల్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టుగా ఊగి గాలిలోకి పల్టీలు కొట్టింది. వెహికల్ ఇసుకలో దొర్లుకుంటూ 25 మీటర్లు దూరంలో పడింది.
అనుకోని సంఘటనకి ఒక్కసారిగా ఎనిమీ గ్యాంగ్ షాక్ అయ్యారు.
ఆ అవకాశం కోసమే కాచుకుని ఉన్న అగస్త్య, ఖలీల్ డెస్పరేట్ గా ఫైరింగ్ ఓపెన్ చేశారు.
శత్రువులు తేరుకునే లోపలే సగం మంది పిట్టల్లా రాలిపోయారు.
క్విక్ గా రియాక్ట్ అయిన గ్యాంగ్ తమ దాడిని ప్రారంబించింది.
సాహు వెహికల్ ను నేర్పుగా డ్రైవ్ చేస్తున్నాడు.
బుల్లెట్స్ వెహికల్ ను రాసుకుంటూ ఇసుకలో పడుతున్నాయి. సత్యమూర్తి భయంతో సీట్ కు కరుచుకుపోయాడు.
వెహికల్ షేక్ అవుతుంటే అగస్త్య టీం కి గురి కుదరడం లేదు.
“బ్రో! నేను టాప్ కి పోతున్నా” అంటూ కార్ పైకి ఎక్కాడు.
అతనికి బాలన్స్ కుదరడం లేదు.
“సాహు… వెహికల్ స్లో చెయ్యొద్దు” అంటూ అగస్త్య డోర్ తెరుచుకుని ఒక్కసారి దూకేశాడు.
అతని ప్లాన్ అర్థం కాకపోయినా ఖలీల్ కూడా అతని వెనుకే జంప్ చేశాడు.
ఎక్స్ పెక్ట్ చెయ్యని సంఘటనకు సత్యమూర్తి , సాహు ఒక్కసారిగా షాక్ అయ్యారు
“హిమా! వాట్ హప్పెండ్?” అయోమయంగా అడిగాడు సాహు.
“నథింగ్ టు వర్రీ సా…” అగస్త్య ప్లాన్ అర్థం చేసుకున్న హిమాంషు నింపాదిగా కార్ పైనుండి సమాధానం చెప్పాడు.

(క్షిపణిలో చిన్నబ్రేక్ …వచ్చేవారం వరకూ)

ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY