స్వరం ఒక వరం…స్వరసాహితీ ప్రయాణం నా గమనం గమ్యం….పద్మశ్రీ

ఇది చిత్రపరిశ్రమ
ఇది విచిత్ర పరిశ్రమ
ఒక్కోసారి ప్రతిభ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది.
స్వరం వినిపించే గళం మరుగున పడిపోతుంది.
బుర్రా పద్మశ్రీ…
పాటలు పాడడం ,రాయడం,స్వరాలు సమకూర్చడం…ఆమెకు ఇష్టమైన విషయాలు
పద్మశ్రీ పాటలు పాడుతుంది.పాటలు రాస్తుంది…స్వరాలు సమకూర్చుతుంది.
“అవకాశం కోసం అర్థించను…వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోను…”అన్నది ఆమె సిన్సియర్ ఫీలింగ్.
పాట ఏదైనా ఆమె స్వరంలో ఒదిగిపోతుంది.సాహితీ విలువలు,వాణిజ్యసూత్రాలు,స్వరంలో పలికే సరిగమలు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ,స్వర ప్రయాణం చేస్తోన్న గాయని.
క్లాసికల్ సంగీతం నేర్చుకుని.లైట్ మ్యూజిక్ లో డిప్లొమా చేసి,రాగాలు సమకూర్చుతూ,స్వరాలవాణిని వినిపిస్తుంది.
బృందావనం పేరుతొ ఒక ఈవెంట్ ను ఏర్పరిచి,కచేరీలు చేసానని చెబుతున్న పద్మశ్రీ గతంలో విజయవాడలో సిటీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసారు.
ఆకాశవాణి లో అనౌన్సర్ గా,డ్రామా “B”హై ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు వ్యవహరించే తాను..గీతరచయిత్రిగా శివ అనే సినిమాకు పాట కూడా రాసారు.
“తెలుగు రక్షణ “వేదిక ఆధ్వర్యం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం స్పాట్ న్యూస్,ఛానెల్ వారు కేంద్రమంత్రి దత్తాత్రేయ చేతుల మీదుగా ఇప్పించిన best singer of the year అవార్డు మరువలేని జ్ఞాపకాలు “.అంటారు పద్మశ్రీ వినమ్రంగా….
గాయనిగా,గేయరచయిత్రిగా,స్వరకర్తగా పద్మశ్రీ గుర్తింపు పొందుతుందని ఆశిద్దాం.
ప్రతిభ ఉన్న కళాకారులు,సాంకేతిక నిపుణులు లేరనే చిత్రపరిశ్రమ ప్రతిభను శోధించాలి.ప్రతిభావంతులను ప్రోత్సహించాలి.
ఆల్ ది బెస్ట్ పద్మశ్రీ

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY