వీటి గురించి మనకు ఎంతవరకు తెలుసు ? డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ కాలమ్

స్కూల్ వదిలారు..పిల్లలు క్రమశిక్షణ కలిగిన చీమల్లా లైనులో వెళ్తున్నారు.చాలా ముచ్చటైన దృశ్యం.
ధన్వి అనే ఆరేళ్ళ పాప పుస్తకాల బాగ్ ను సర్దుకుంటూ నా దగ్గరికి వచ్చింది.
“గుడ్ ఈవెనింగ్ సర్ “అని విష్ చేసింది.వాళ్ళు నా స్టూడెంట్స్..అనుకుంటేనే గర్వంగా వుంది…
ఆ సంస్కారానికి ముచ్చటేసింది.
ఆ పాపను ఎత్తుకుని “వెరీ గుడ్ ఈవెనింగ్ తల్లీ”అన్నాను.”సర్ అని నా వైపు చూసి ఏదో అలోచించి తన బాగ్ లోని కాగితాన్ని తీసి ఈ కాగితాన్ని ఎన్నిసార్లు మడతపెట్టగలరు?అని అడిగింది.
ఒక్కక్షణం ఆలోచించాను..దీని గురించి ఎపుడూ ఆలోచించలేదు.
“సగానికి ఎన్నిసార్లు మడతపెట్టగలరు?మళ్ళీ అడిగింది?
‘అప్పుడు గుర్తొచ్చింది…ఎక్కడో చదివిన విషయం….
వెంటనే ఆ పాప వంక చూసి”నాకు తెలియదు తల్లీ నువ్వు చెప్పు?అన్నాను.తెలిసినా….
వెంటనే హుషారుగా”ఏడుసార్లు…ఆ తర్వాత మనం మడతపెట్టలేము”చేతులు ఆడిస్తూ చెప్పింది.
“వావ్ గ్రేట్ ..నిజమా ?అంటూ .ఆ పాపకు నా జేబులోవున్న పెన్ గిఫ్ట్ గా ఇచ్చాను…ఆ పాప కళ్ళలో వెలుగు..”నాకు ఇలాంటివి బోల్డు తెలుసు సర్”అంది.
‘అవునా అయితే రేపటి నుంచి లీజర్ పిరియడ్ లో మీ ఫ్రెండ్స్ కు చెప్పు”అన్నాను…
మరుసటిరోజు..క్లాస్ లో పిల్లల ముందుఈ విషయాన్ని చెప్పి .ప్రాక్టికల్ గా చూపించాను.
మీరు సగానికి ఏడుసార్లకు పైగా కాగితాన్ని మడిచి చూపించగలరా?
తమ చేతుల్లో ఏ ఆయుధం లేదని నిరూపించుకోవడానికి కరచాలనం (షేక్ హ్యాండ్)మొదలైందట.
మీకు కళ్ళు తెరిచి తుమ్మడం సాధ్యమా?కళ్లు తెరిచి తుమ్మడం సాధ్యం కాదు…
అంకెలను ఇంగ్లీషులో రాసేటప్పుడు Thousand లో తప్ప, 1-999 వరకు ఎక్కడా A అక్షరం రాదు…
ఇలాటి చిన్న విషయాలు పిల్లలకు నేర్పించడం,పిల్లల చేత చదివించడం వాళ్ళ వాళ్లకు మెమరీ పవర్ పెరుగుతుంది.విజ్ఞానం పెరుగుతుంది.పేరెంట్స్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
పిల్లల్లో సృజనాత్మకత పెంచుతూ,వాళ్ళ మెదడుకు పదును పెట్టె విషయాలు పిల్లలను షార్ప్ గా తయారుచేస్తాయి.
పిల్లలకు పనికి వచ్చే వింతలూ విశేషాలు,చిక్కులెక్కలు,తమాషా కబుర్లు చెబుతూ,పిల్లల చేత చదివిస్తూ ఉండాలి.తల్లిదండ్రులుగా అది మన బాధ్యత అని గుర్తించాలి.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY