న్యాయాన్ని కాపాడే మూడుతరాల న్యాయవాదుల కుటుంబంలో పుట్టిన ఒక చిన్నారి…డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas తేజారాణి తిరునగరి అక్షర కథనంతో…

ఫీడ్ బ్యాక్
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారికి…
*మీ గురించి తెలుసుకోవడం బావుంది.ఒక సెలబ్రిటీ సక్సెస్ స్టోరీని పాఠకులకు అందించాలన్న మేన్ రోబో ఆలోచనకు కృతఙ్ఞతలు …కృష్ణ పుట్టపర్తి గారూ…మీ జీవితంలోని అత్యంత సంతోషకరమైన సంఘటన ఏమిటో చెప్పగలరా?స్వాతిప్రియ(బెంగుళూర్)
*మా సిస్టర్ టెక్సాస్ లో ఉంటుంది.ఈ సీరియల్ ని వాట్సాప్ ద్వారా తానే మాకు పంపింది.మీలాంటి సెలబ్రిటీ గురించి తెలుసుకొనే అవకాశం ఇచ్చిన మేన్ రోబోకు ధన్యవాదాలు ..డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారితో ముఖాముఖీ పెడితే బావుంటుందని మా సూచన ..ఆర్.కిరణ్మయి(విజయవాడ)
*సర్…మీ అనుభవాలు నేటి యువతకు మార్గదర్శకం కావాలని మా కోరిక….నారాయణస్వామి (విశ్రాంత ఉపాధ్యాయులు)వైజాగ్
*మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి లేదా సంఘటన గురించి చెప్పగలరా? కృపాకర్ (వరంగల్)
(మీ ప్రశ్నలు కృష్ణ పుట్టపర్తి గారికి పంపించాం.త్వరలో మీకు సమాధానాలు లభిస్తాయి,మీ సూచన పరిగణలోకి తీసుకుంటాం…చీఫ్ ఎడిటర్)
నాంది
జననం ఒక గమనానికి సంకేతం
మరణం ఒక నిష్క్రమణకు ముగింపువాక్యం
ఈ రెంటి నడుమ పయనం మనల్ని చరిత్రలో నిలబెట్టే గొప్ప అవకాశం.
పుట్టిన ప్రతీ వ్యక్తి పేరుతొ పుట్టరు…మనం పుట్టేక మనకో పేరు పెడతారు.ఆ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అవకాశం,నిలుపుకునే వారి వ్యక్తిత్వం చరిత్రలో సువర్ణాధ్యాయం అవుతుంది.
మనం సాధించిన విజయాలు,మన వ్యక్తిత్వం…మనల్ని మరణించేక కూడా బ్రతికిస్తుంది.
మనం చరిత్రలో ఒక పేజీలో ఉండాలా?చరిత్రలో కనిపించని అనామకులుగా మిగిలిపోవాలా?అన్నది మనం మాత్రమే నిర్ణయించుకోగలం.
ఒక నాయకుడు కావచ్చు
ఒక మహానేత కావచ్చు
ఒక క్రీడాకారుడు
ఒక కళాకారుడు
ఒక వ్యాపారవేత్త
ఒక శాస్త్రవేత్త
ఒక విద్యావేత్త
ఇలా ఏ వృత్తిలోని వారైనా…చరిత్రలో నిలిచి,చరిత్ర సృష్టించి చరిత్రగా మారి ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్ఫూర్తిప్రదాతలు కావచ్చు.
అహింసామార్గానికి అడుగులు నేర్పిన బాపూజీ …
దేశభక్తికి ,ధైర్యానికి ఉగ్గుపాలు తాగించిన సుభాష చంద్రబోస్…
మానవతాస్ఫూర్తి గా నిలిచిన మదర్ థెరీసా …
చరిత్రలో నిలిచినవారే…చరిత్రగా మారినవారే.
రాజ్ కపూర్ మొదలు అమితాబ్,షారూక్,లాంటి నటులు ప్రేక్షకుల్లో మదిలో స్థానం సంపాదించినవారే…
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకాన్ని ప్రపంచానికి చాటిన మహానటులు ఎన్ఠీఆర్,ప్రతినాయక పాత్రల యస్వీఆర్ మొదలు…నటసామ్రాట్ అక్కినేని మొదలు.విశ్వకథానాయకుడు కమల్ హాసన్ వరకూ…
గానగంధర్వుడు ఘంటసాల మాస్టారూ మొదలు,బాలూ ,జేసుదాసు ,బాలమురళీకృష్ణ,లతాజీ, వంటి మహాగాయకులు…
ఒక టాటా
ఒక ధీరూభాయ్ అంబానీ లాంటి వ్యాపారసామ్రాట్ లు …
కళాకారులూ,సాంకేతిక నిపుణులు,డాక్టర్స్,ఇంజినీర్స్ …ఇలా….
చరిత్రలోనిలిచిన ప్రముఖులు సెలబ్రిటీలు….వాళ్ళ జీవిత కథనాలు,వాళ్ళ ఫెయిల్యూర్స్ ,సక్సెస్ లు…మనకు మార్గదర్శకంగా స్ఫూర్తిగా నిలుస్తాయి.
జీవితంలో ఉన్నతస్థానంలో నిలిచిన ప్రతీ సెలబ్రిటీ కథనం…మనకు స్ఫూర్తికథనమే అవుతుంది.
వందల కోట్ల ప్రపంచజనాభాలో..
వందకోట్ల మైలురాయి దాటిన మనదేశ జనాభాలో కేవలం లక్షల సంఖ్యలోనే సెలబ్రిటీలు,ప్రముఖులు ఉన్నారన్నది అక్షరసత్యం కాదా?
కృషి పట్టుదల కమిట్మెంట్
మేథస్సు మొక్కవోనిధైర్యం గెలవాలనే కసి…
జీవితంలో మనకంటూ ఒక గమ్యం ఉండాలి..
చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి
ఈ ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి…
ఆలోచన ఆయుధమైతే…
మనం ఎంచుకున్న గోల్ మన సైన్యం అవుతుంది
విజయం మన స్వంతం అవుతుంది…
మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలన్నది..
ఈ ప్రపంచాన్ని మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలన్నది మనమే నిర్ణయించుకోవాలి.
నత్త అయినా నడవడం మొదలుపెడితే ఎపుడో ఒకప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇది నిజం ఇదే సత్యం ఇదే జీవితతత్వం….
(ప్రముఖ రచయిత విజయార్కె గారి రచనల నుంచి…)
vijayarke rachanaluప్రారంభం
ఒకానొక స్ఫూర్తి మకుటం….
నా తొలి వ్యక్తిత్వ వికాస రచనకు స్ఫూర్తినిచ్చిన కథనం…
నా తొలిప్రయత్నం …
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి ..పెనుకొండ టు డల్లాస్
యువతకు నవతకు జనతకూ ఆలోచన కలిగించే శుభారంభానికి కైమోడ్పు.
***
అది మూడుతరాల నేపథ్యం
అది న్యాయవాదుల కుటుంబం
తాత తండ్రి సోదరుడు…ముగ్గురూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు.
అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక చిన్నారి కాలక్రమంలో ఒక గొప్ప వైద్యుడు అవుతాడని,విదేశాల్లో,ప్రవాస భారతీయుడుగా తన స్థానాన్ని పదిలపర్చుకుని, ప్రముఖుడై వన్నె తెస్తాడని ఎవరూ ఊహించి వుండరు.
అయితే సాధించిన ఆ విజయం వెనుక వున్న నేపథ్యం,ఆ కథనం తెలిస్తే ఎందరో స్ఫూర్తి పొందుతారు.
మరెందరో సెలబ్రిటీలు విదేశాల్లో మన ప్రతిభను చాటుతారు.

(జర్నీలో చిన్న బ్రేక్)

(ప్రవాస భారతీయులకు…
ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం.
అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు.)
ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …చీఫ్ ఎడిటర్)

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

2 COMMENTS

  1. ఫేస్బుక్ ద్వారా పరిచయం. చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేశాను .సమాజసేవలో కూడా అతని పాత్ర ఉంది.పెనుకొండలో ఉండే అతని మిత్రుడు నాకు కూడా మిత్రుడే. జర్నీ ఫ్రమ్ పెనుకొండ టు డల్లాస్ .చాలా మందికి స్పూర్తి దాయకం అవుతుంది.

    • ఈ సీరియల్ మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.ప్రవాసభారతీయులు కృష్ణ పుట్టపర్తి సన్నిహితులు తమ స్పందనను తెలియజేయవచ్చు….చీఫ్ ఎడిటర్

LEAVE A REPLY