తన స్వరంతో స్వరాలకు సొబగులద్ది,తన గళంతో పాటలకు రంగులద్ది,తన అక్షరాలతో కవితలకు రంగవల్లులద్ది,పాటలకు పల్లవులను చరణాలను నయనాలుగా చేసి ,తన కథనాన్ని మేన్ రోబో పాఠకులకు ఇంటర్ వ్యూ ద్వారా అందించిన బుర్రా పద్మశ్రీ కి అభినందనలను అందజేసిన పాఠకులకు కృతఙ్ఞతలు.
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించాలి.కృషిని అభినందించాలి…వినమ్రతను అక్కున చేర్చుకుని ఆదరించాలి.
చిత్రపరిశ్రమలో గీతరచయిత్రులు అరుదు…అవకాశం ఇస్తే ముందుకు వస్తారు.తమ ప్రతిభను నిరూపించుకుంటారు”అంటోన్న పద్మశ్రీలో “భావుకత నిండిన” కవియిత్రి కూడా వున్నారు.
ఆ కవిత మేన్ రోబో పాఠకుల కోసం అందిస్తున్నాం.
ఫీడ్ బ్యాక్
*పద్మశ్రీ గారి పరిచయం చాలా బావుంది.“అవకాశం కోసం అర్థించను…వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోను…”అన్నది ఆమె సిన్సియర్ ఫీలింగ్.మా గుండెలోతుల్నిస్పృశించింది.ఒక గాయని ఆత్మవిశ్వాసం ఇంత గొప్పగా ఉంటుందా?అనిపించింది.పద్మశ్రీగారికి మంచి అవకాశాలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం…పల్లవి,శ్రావణి,సంజయ్,సమీర్ ,శ్రావ్య(చెన్నై)
*మేన్ రోబోలో పద్మశ్రీగారి ఫీలింగ్స్ హార్ట్ టచింగ్ గా వున్నాయి.చిత్రపరిశ్రమ టాలెంట్ వున్నవారిని ప్రోత్సహించాలి…నాయుడు(నెల్లూరు)
*పద్మశ్రీ గారి కలం నుంచి ఒక మంచి శీర్షికను మేన్ రోబో ద్వారా అందిస్తే బావుంటునదాని మా విన్నపం…సంగీత ,మనోహర్(వైజాగ్)
*దుబాయిలో వున్న మా ఫ్రెండ్ వాట్సాప్ ద్వారా (మేన్ రోబోలో వచ్చిన కథనం )పంపించిన పద్మశ్రీగారి ఇంటర్ వ్యూ సూపర్బ్…నవ్యానాయర్(ముంబై)
*పులకించని మది పులకించు…”అంటూ మేన్ రోబో తెలుగు ఇండియా /యు ట్యూబ్ లో పద్మశ్రీ గళంతో స్వరంతో అందించిన పాట మా అభిమానపు తోటలో పరిమళాలు వెదజల్లుతుంది…తాంక్యూ మేన్ రోబో …థాంక్యూ పద్మశ్రీగారు.
జీవితంలో అన్నింటినీ,అందరినీ కోల్పోయిన అతనికి…మనసు కోరుకునే సాన్నిహిత్యం. శరీరం కోరుకునే సాంగత్యం…వెరసి ఓ సెక్యూర్డ్ ఫీలింగ్….విజయార్కె కథ విభ్రమ