అమ్మ యశోదలా నా చెవి మెలిపెట్టలేదు కానీ…డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas తేజారాణి తిరునగరి అక్షర కథనంతో…(28-08-2016)

డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas
తేజారాణి తిరునగరి అక్షర కథనంతో…(28-08-2016)
                                        (2)
ఫీడ్ బ్యాక్
* డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…పెనుకొండ టు డల్లాస్ సీరియల్ ప్రారంభంలోనే ఆకట్టుకుంది.ఇది మంచి ప్రయోగం.ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసిన మేన్ రోబోకు హేట్సాప్ చెప్పాలి.డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారు చెప్పే విషయాలు మమ్మల్ని ఇన్ స్పయిర్ చేస్తాయని నమ్ముతున్నాం…శ్వేత,ప్రతిమ.విజయ్ (హన్మకొండ)
*రియల్లీ గ్రేట్ …డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారి గురించి మేన్ రోబోలో చదివి థ్రిల్లయ్యాం…సాధిక్ .బ్రహ్మానందరావు (నెల్లూరు)
*ప్రవాస భారతీయుల విజయగాథలు మరిన్ని మేన్ రోబో ద్వారా వెలుగులోకి రావాలి.తేజారాణి తిరునగరి గారికి అభినందనలు.డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారికి స్వాగతం.మేన్ రోబోకు కృతఙ్ఞతలు.

***

ఇది పెనుకొండ నుంచి బయల్దేరి డల్లాస్ లో సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ప్రస్థానంలో ఎదురైన అనుభవాల పాఠాలు.నేటి యువతకు,రేపటి భవితకు మార్గదర్శకాలు.
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి వ్యక్తిత్వ వికాసానికి అక్షరాల అనువాదం…తేజారాణి తిరునగరి అందించే అక్షర కథనం.
నేను …
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…
నా గురించి నేను చెప్పుకోవడం అంటే అద్దంలో నన్ను నేను చూసుకోవడమే…”అద్దంలో మిమ్మల్ని చూసి “తమని తాము ఐడెంటీఫై చేసుకుని మీ సక్సెస్ ల నుంచి,మీ లైఫ్ జర్నీ నుంచి కొంతైనా నేర్చుకుంటారు…మీ అనుభవాలు,మీ ప్రస్థానం కొందరికైనా దిక్సూచిలా మారుతుందని “అన్నారు రచయిత్రి తేజారాణి గారు.
నా గురించినేను చెప్పుకోవడం వలన ,”ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు..”అన్న చిన్న సంతృప్తితో…ఇలా మీ ముందుకు వస్తున్నాను.
వృత్తిపరమైన బిజీ కానీ ఒత్తిడి కానీ వున్నా,ఇలా మీ ముందుకు వచ్చినప్పుడు,మీ అభినందనలు ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు కలిగే ఆనందానికి మాటలు చాలవు…అక్షరాలు సరిపోవు…
మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు స్పందన నాకు మరింత స్ఫూర్తిని ఇస్తాయి.ఆ నమ్మకంతోతోనే డల్లాస్ లో వున్న నేను ఈ ధారావాహికను పెనుకొండ నుంచి మొదలుపెడుతున్నాను.
నేను ఒక సామాన్యుడిని.
అనంతపురంలోని పెనుకొండలో నా బాల్యాన్ని ఒక కలలా గడిపినవాడిని.బాల్యం ఎంత అందంగా ఉంటుంది?
ఓ కథలో చదివిన గుర్తు
ఓ కోటీశ్వరుడు దేవుని కోసం తపస్సు చేస్తాడు.దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు.అప్పుడా కోటీశ్వరుడు “దేవుడా నాకు ఒక్కసారి నా బాల్యాన్ని తిరిగివ్వు”అని కోరుకుంటాడు.ఎంత సంపాదించినా,ఎంతటి విలాసవంతమైన జీవితాన్ని గడిపినా చిన్ననాటి జీవితాన్ని తిరిగిపొందలేరు కదా?
నిజమే కదా?
ఆటలు పాటలు ఆకతాయి అల్లరి…ఎంత గొప్పగా ఉంటుంది?ఏమీ తెలియని అమాయకత్వం…ఎంతో తెలుసనుకునే ఆకతాయితనం.
చిన్నప్పుడు నా అల్లరి ఎక్కువే.అమ్మ యశోదలా నా చెవి మెలిపెట్టలేదు కానీ…నేను అల్లరిలో చిన్ని కృష్ణుడినే…
అలా అని నా పేరులో కృష్ణుడు ఉన్నంత మాత్రాన నేను అంతటి గొప్పవాడిని కాదు.
జీవితం అంటే ఒక ప్రయాణం
జననం ప్రయాణానికి తొలి మజిలీ…మరణం తుది మజిలీ.
ఈ రెండింటి మధ్య మనం చేసే ప్రయాణంలో ఎన్నో స్టేషన్ లు …మనతో పాటు ప్రయాణం చేసే తోటి ప్రయాణీకులు.
మన మిత్రులు,బంధువులు,హితులు,సన్నిహితులు,ప్రత్యర్థులు,శత్రువులు….
ఈ నిరంతర ప్రయాణంలో సాఫీగా సాగిపోయే మజిలీలు ఎన్ని?
బాల్యంలోని కొన్ని అపురూప సంఘటనలు మరోసారి ప్రస్తావిస్తాను…
ఎందుకంటే బాల్యం తిరిగిరానిది…కాలంలా…
అందుకే మన పిల్లలకు బాల్యాన్ని అపురూప జ్ఞాపకంగా ఉండేలా తీర్చిదిద్దాలి.పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి.
అమ్మగోరు ముద్దలు
అమ్మమ్మ తాతయ్యల ఒళ్ళో ఆటపాటలు
మేనత్తలు మామయ్యలు బాబాయిలు…
అందరి మధ్య అందమైన జ్ఞాపకం బాల్యం.
ఇలాంటి బాల్యాన్ని మన పిల్లలకు అందిద్దాం…
ఎందుకంటే బాల్యంలోని గొప్పదనాన్ని చూసినవాడిని…నా మూలాలు బాల్యంలోనే ఉన్నాయని తెలుసుకున్నవాడిని.
(జర్నీ లో చిన్న బ్రేక్..వచ్చేవారం వరకూ)
(ప్రవాస భారతీయులకు…
ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం.
అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు.)
ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …చీఫ్ ఎడిటర్)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

1 COMMENT

  1. I am very happy regarding my friend achivements in his journy from penukonda to Dallas . I have to say many many thanks to Tejarani to bring his autobiography through this media. I am eagarly awaiting for next week episode.

LEAVE A REPLY