HomeSerialsSerial2నా పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా?అని చీమ అన్నట్టు..గుర్రం నోట్లో చేయిపెడితే ఊరుకుంటుందా? డాక్టర్ కృష్ణ...
నా పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా?అని చీమ అన్నట్టు..గుర్రం నోట్లో చేయిపెడితే ఊరుకుంటుందా? డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో(25-09-2016)
ఫీడ్ బ్యాక్ *మేన్ రోబోకు ,కృష్ణ పుట్టపర్తిగారికి,తేజారాణి గారికి మెనీ మెనీ థాంక్స్.అలనాటి అపురూప చిత్రం మాయాబజార్ గురించి మీరు చెప్పిన తీరు మిక్కిలి ప్రశంసనీయం .ఇప్పటితరం వారికి తెలియక పోవచ్చు.కానీ మాయాబజార్ ఒక గొప్ప కళాఖండం.అలాగే ఆ చిత్రం విడుదలైన రోజునే పుట్టిన కృష్ణ పుట్టపర్తిగారికి అభినందనలు.నా పుట్టిన రోజు మాయాబజార్ విడుదలరోజు ఒక్కటే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. రెంటినీ మేళవించి చాలా అద్భుతంగా ధారావాహికల్లో ఒక భాగంగా అందించినతీరు అభినందనీయం.వీలైతే కృష్ణ పుట్టపర్తిగారితో ముఖాముఖీ శీర్షిక పెట్టగలరు…సోమనారాయణ మూర్తి (ముంబై)విశ్రాంత ఉపాధ్యాయులు *కృష్ణ పుట్టపర్తిగారు వృత్తిరీత్యా డాక్టరా?డాక్టరేట్ పట్టా పొందారా?విశ్వవిద్యాలం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందా?ప్రస్తుతం కృష్ణ పుట్టపర్తి గారు ఏం చేస్తున్నారు?వారు చేస్తోన్న ఉద్యోగం ఏమిటి? పెనుకొండ నుంచి డల్లాస్ చేరిన ఒక ప్రముఖుడి గురించి తెలుసుకోవాలన్న మా తపన అర్థం చేసుకోండి…సుమతీశర్మ(గుంటూరు) (6) గతవారం మాయాబజార్ అధ్యాయం గురించి స్పందించిన పాఠకదేవుళ్ళకు కృతఙ్ఞతలు.చాలా సంతోషం.నేను రాస్తోన్న విషయాలు ,నేను చెబుతోన్న సంగతులు విశేషాలు మిమ్మల్ని అలరిస్తున్నందుకు..మీకు ఉపయోగపడుతున్నందుకు. “మీరెప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఏర్పడిన ఇంద్రధనుస్సును చూసారా?రెయిన్ బో ..ఎంత అందంగా ఉంటుంది.చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టు ఉంటుంది.ఇప్పటికీ చిన్న పిల్లలు ఆ దృశ్యాన్ని చూస్తోంటే నేను ఓ పిల్లాడినైపోతాను. బాల్యం కూడా ఆ ఇంధ్రధనుసులాంటిదే అని నా ఫీలింగ్ . అయితే బాల్యంలో కొన్ని అల్లరులు అందంగా ఉంటాయి…వాటి వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. చిన్ని కృష్ణుడు పూతనను చంపడం దైవఘటన.అది మానవమాత్రులకు సాధ్యం కాదుకదా… అల్లరి ఆనందంగా ఉంటుంది.దెబ్బలు ఆ వయసులో సాధారణమే అనిపిస్తుంది.చిన్నప్పుడు సైకిల్ తొక్కేప్పుడు సైకిల్ చక్రంలోకి కాలు వెళ్ళిపోయింది.రక్తం పోయింది.నాన్నకు తెలిస్తే ఎలా అనే భయం… ఇప్పుడు పిల్లలు రిమోట్ తో కారు ఆడుకుంటున్నారు.సైకిల్ తొక్కడం…ఆటలు ఆదుకోవడం ఎక్కడుంది? ప్రైవేట్ క్లాసెస్..హోమ్ వర్క్…లేదంటే వీడియో గేమ్స్…ఆటలు క్రమక్రమంగా కనుమరుగైపోయాయి.పిల్లల మెదళ్ళు యాంత్రికంగా ముందుకు సాగుతున్నాయి.చిన్నప్పటి స్మృతులు మిగిలివుంటాయా?అన్నది సందేహమే.ఆధునికత బాల్యం తాలూకూ అనుభూతులను,జ్ఞాపకాలను కనుమరుగు చేయకూడదు.మిస్ చేయకూడదు అన్నది నా ఉద్దేశం. చిన్ననాటి ఒక సంఘటన ఇప్పుడు తల్చుకుంటే కాస్త భయం కూడా వేస్తుంది.అప్పట్లో జట్కాబండ్లు ఉండేవి…ఇప్పటికీ కొన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి.జట్కాబండికి వున్న గుర్రం నోట్లో చేయి పెట్టాను.నేనేం ఆ వెన్నదొంగ చిన్ని కృష్ణుడిని కాదుకదా…ఆర్డినరీ కృష్ణుడిని… నా పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా?అని చీమ అన్నట్టు..గుర్రం నోట్లో చేయిపెడితే ఊరుకుంటుందా? రక్తం కారింది..కుట్లు పడ్డాయి..నాన్నతో అక్షింతలు పడ్డాయి. ఇలాంటి అతితెలివి అల్లరికి దూరంగా ఉండాలని అప్పుడే తెలిసొచ్చింది. ఆ తర్వాత అలాంటిదే కాకపోయినా మరో తుంటరి పని…నా తలకు రామకీర్తన పాడింది. అప్పట్లో..ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల చీరలు,బట్టలు ఆరేసి వాటిమీద సపోర్టుగా పడిపోకుండా రాళ్లు పెడతారు. ఇప్పుడంటే క్లిప్పులు,స్టాండులు గట్రా వచ్చాయి.డ్రయర్లు కూడా వచ్చాయనుకోండి. నేనేదో సాహసం చేస్తున్నాననుకొని చీర తెచ్చిస్తానని చెప్పి బుద్దిగా రాయి తీసి చీరె తెచ్చివ్వక,చీరను లాగాను.చీర మీద సపోర్ట్ గా వున్నా రాయి నా నెత్తి మీద పాడింది.ఇంకేముంది? ఇవ్వన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే..బాల్యమా..నువ్వు మళ్ళీ వస్తావా ? నువ్వు వెనక్కి తిరిగి ఎంత బావుండు?నా బాల్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునే వాడిని కదా? బాల్యం లేని జీవితం వుంటుందా?మరి మీ బాల్యంలోని సంగతులేమిటి? ఈ తరం తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఒక్కటే…? (జర్నీ లో చిన్న బ్రేక్..వచ్చేవారం వరకూ)
(ప్రవాస భారతీయులకు… ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం. అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు. ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …) ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్