(8)
జీవితంలో భార్యాభర్తలిద్దరూ కలిసిపనిచేస్తారు కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.కడవరకూ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.కాబట్టి.ఒకరికొకరు అన్నట్టు బ్రతకాలి..జీవించాలి..భార్యాభర్తల జీవితానికి ఒక అర్థాన్ని చెప్పాలి. నా సక్సెస్ లో నా భార్య కాంట్రిబ్యూషన్ 100% ఉందని గర్వంగా చెప్పుకుంటాను…
తను నాకు కష్టాల్లో నీడ..సుఖాల్లో సంతోషం…మా సహప్రయాణం ప్రతీక్షణం ఉద్విగ్నభరితమే…
నాకెప్పుడూ ఏమిటీ జీవితం అనే వేదాంతం అలవడలేదు.కాకపోతే ఈ జీవితానికి ,ప్రతీ వ్యక్తి జీవితానికి అర్థం పరమార్థం ఉండాలని అనుకుంటాను.
నా జీవితంలో రెండే సంఘటనలు అత్యంత విషాదకరమైనవి.
1997 డిసెంబర్ లో నేను డల్లాస్ లో కాన్ఫరెన్స్ లో వున్నాను.అప్పుడే నాన్నగారి మ…ర…ణ…వా…ర్త.
నన్ను ఎత్తుకుని ఆడించిన నాన్న..
నాకు నడక నేర్పిన నాన్న.
నా తప్పటడుగులు సరిదిద్ది నన్ను ముందుకు నడిపించిన నాన్న.
నాన్న మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను.పుట్టిన వ్యక్తికీ మరణం తప్పదు.కానీ మరణాన్ని మనం భరించలేము…
నాన్నంటే నాకు ప్రేమే కాదు..ప్రాణం.
ఇప్పటిలా పార్థివదేహాన్ని ఎక్కువరోజులు ఉంచే సదుపాయం లేదు.నేను వెళ్లేసరికి నాన్నకు దహన సంస్కారాలు జరిగాయి.నాన్నను చివరి చూపు కూడా చూడలేకపోయాననే బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంటుంది.
ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మా నాన్న చనిపోయిన ఆరునెలలకు నా చెల్లెలు అనారోగ్యంతో కన్ను మూసింది.అమెరికాలో ఉండి కూడా,నా చెల్లెలిని బ్రతికించుకోలేకపోయాను.మరణం ఆపడం ఎవరివల్ల సాధ్యం కాదేమో..
ఈ రెండు సంఘటనలు నన్ను ఎపుడూ వెంటాడే విషాద జ్ఞాపకాలు.
నాకు అందరూ స్నేహితులే…
అందరికీ సాయం చేస్తాను.కులం మతం అని చూసుకోను.నాక్కుడా వాళ్ళ సాయం కావాలి.ఒకటి మాత్రం గుర్తు.ఆ సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నాను.మర్చిపోను కూడా.
లాస్ ఏంజెల్స్ లో వున్న సమయంలో ఆయనెవరో తెలియదు.కానీ సాయం చేసాడు.ఆయనెవరో తెలియదు..కానీ ఇప్పటికీ నాలాంటి వాళ్లకు సాయం చేస్తూనే ఉంటాడు.అది మాటసాయమా ?డబ్బు సాయమా?అన్నది కాదు..నేనెవరో నాది ఏ కులమో మతమో..దేశమో అని ఆలోచించకుండా చేసిన ఆ సాయం దైవత్వంతో సమానం.
డల్లాస్ కు వచ్చేవాళ్లకు …
విదేశాలకు వెళ్లడం తప్పేమీ లేదు..వెళ్ళండి కానీ మన మాతృభూమిని మర్చిపోకండి.అందరికీ అవకాశం రాదు.పిల్లలకు చదువు చెప్పడానికి సాయం చేయండి.మీ వూళ్ళో వున్న వాళ్ళకే సాయం చేయొచ్చు.ఒకవేళ మీరు ఇండియా వెళ్లాలని అనుకుంటే…”పిల్లలు చిన్నగా వున్నప్పుడే తిరిగి ఇండియా వెళ్ళండి.ఒకసారి ఇక్కడి జీవన విధానానికి అలవాటు పడిపోతే వెళ్లడం కష్టం….అయితే ఎక్కడైనా సుఖాలు కష్టాలు ఉంటాయి.మనం అలవాటు చేసుకోవడం..అడ్జస్ట్ కావడం..పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం,మనం పరిస్థితులకు అనుగుణంగా మారడం చాలా ముఖ్యం …అని నా అభిప్రాయం.
కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను…
కోపం అనేది మన ప్రధానశత్రువు అని ఒక వ్యక్తిత్వ వికాసపుస్తకంలో చదివిన గుర్తు.సైన్స్ కూడా అదే చెబుతుంది.
కోపం అనే ఎమోషన్ మనలోని కామన్ సెన్స్ ను చంపిస్తుంది.
హత్యలు,యాసిడ్ దాడులు ,చిల్లర కోసం సైతం గొడవలు,కత్తిపోట్లు ఉన్మాదచర్యలు అన్నీ కోపానికి రిలేటెడ్ అని నా ఉద్దేశం.
కోపం ఎక్కువైనప్పుడు విచక్షణ కోల్పోతాం.విచక్షణ కోల్పోయినప్పుడు ఉన్మాదం మనల్ని ఆవహించవచ్చు.
చిన్న చిన్న కోపాలు వేరు..ఆ కోపాన్ని ప్రదర్శించడం వేరు..కానీ కోపాన్ని తీవ్రరూపంలోకి మార్చుకోవడం ప్రమాదకరం.
నాకు కోపం వస్తూ ఉంటుంది.సమాజంలో కొందరిని కొన్ని సంఘటనలను చూసినప్పుడు..నేను మీడియాలో వున్నాను కాబట్టి..కోపం వచ్చినప్పుడు మాట్లాడను…మౌనంగా ఉంటే కోపం చల్లారుతుంది.పక్కకి వెళ్తాను.కాసేపు కామ్ గా వుంటాను..కోపం చల్లారేవరకూ…
ఒంటరిగా వున్నప్పుడు…
నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు.ఎవరో ఒకరు పక్కన ఉండాల్సిందే..సమయం ఉంటే ఎదో పనిచేస్తాను.పనిలేకుండా ఉండడం నాకు నచ్చదు.పనిచేస్తూ ఉంటే మన మెదడు కూడా షార్ప్ గా ఉంటుంది కదా.
ఈ ప్రపంచం ఏమిటి?అని ప్రశ్నించుకుంటే …మనం ఏమిటో ముందు తెలుసుకోవాలి.డౌన్ టు ఎర్త్ …నాకు డబ్బు సంపాదన మీద కూడా ధ్యాస లేదు.కంఫర్ట్ జోన్ లో ఉండాలి.నేను .కంఫర్ట్ గా ఉండాలి..నాతొ వున్నవాళ్లు నాతొ .కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి.
ఇండియా కు రావాలి అని వుంది..జననీ జన్మభూమిశ్చ ,,,
నా ఊరికి …నేను పుట్టిన వూరికి రావాలి.అక్కడ వున్న పేదపిల్లలకు చదువుచెప్పాలి. సాయం చేయాలి.మనిషై పుట్టాక సాయం చేయాలి.ఇలాంటి అవకాశం రాదు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియాకు అమెరికాకు తేడా…
నేను తెలుసుకుంది..నేర్చుకుంది.ఒకటే…
అమెరికాలో నిజాయితీ.కష్టపడితే విజయాలు సాధించవచ్చు.ఇక్కడ సరైన .సిస్టం ఉంటుంది.చేసిన పని కరెక్టుగా చేయాలి.లైసెన్స్ కావాలి అంటే సరైన కావలిసిన పేపర్స్ ఇస్తే చాలు. ఆఫీసులో బర్త్ సిర్టిఫికెట్ కావాలన్నా…సిస్టమేటిక్ గా ఉంటుంది.ఇండియాలో ఇప్పుడిప్పుడే మెరుగు పడుతుంది.
ఇక్కడ జీవనవిధానం బావుంటుంది.ప్రణాళికాబద్ధంగా జీవించగలిగితే చాలు.ఎవరిపనులు వారు చేసుకోవడం…సమయాన్ని వృథా చేసుకోకపోవడం.టైం వేల్యూ ,మనీ వేల్యూ తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తాను..
డబ్బు సంపాదించడం కష్టం…కానీ ఇక్కడి వచ్చేయగానే ఎంతో ఈజీ గా డబ్బు సంపాదించేయొచ్చని అనుకోకండి.
ఇక్కడ కష్టపడితే హ్యాపీగా ఉండొచ్చు.స్ట్రెస్ ఇక్కడ వుంది.ఎక్కడైనా ఉంటుంది.కానీ స్ట్రెస్ ను అధిగమించడానికి సహనం కావాలి.ప్రాక్టికల్ థింకింగ్ కావాలి కదా !
(జర్నీ లో చిన్న బ్రేక్…వచ్చేవారం వరకూ)
(ప్రవాస భారతీయులకు…
ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం.
అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు.
ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్