భూపతి ఆలోచనలు ఎంతకూ తెగడం లేదు
అగస్త్య తెలివిని చాలా తక్కువగా అంచనా వేశాడు. తనకున్న తెలివి తేటలకు తలకెక్కిన గర్వంతో అగస్త్యను నెగ్లెక్ట్ చేశాడు.
అగస్త్య తనను లాజికల్ గా ట్రాప్ చేశాడు. అతణ్ణి ఇక గెలవడం కష్టం అనిపిస్తోంది.
తన పని కావాలంటే కంప్రోమైజ్ కావాలి.
ఆఫ్ట్రాల్ ఒక మామూలు వ్యక్తికి దాసోహం అనడమా…
భూపతి ఒక్కసారిగా తల విదిల్చాడు.
రామాయణంలో రావణుడు కూడా అదే అహంకారంతో నాశనం అయ్యాడు.
మనకు మంచి చెప్పే వ్యక్తుల మాట వినక చెడ్డాడు.
తనకేమన్న అహంకారం అతణ్ణి లాజికల్ థింకింగ్ నుండి దూరం చేసింది.
తను అలా ఉండకూడదు. పట్టు విడుపులు సహజం
విదిశను అగస్త్యకు చూపితే ఇప్పటికిప్పుడు తనకొచ్చే నష్టం ఏమీ లేదు.
పైగా ఇద్దరూ తన కష్టడీలోనే ఉన్నారు
తన బలగం, తన సెట్ అప్ చాలా స్ట్రాంగ్. దాన్ని దాటి రావడం కాని పోవడం కాని జరగదు.
అగస్త్య ఫ్రండ్స్ ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటారు.
భూపతి ఏదో డిసైడ్ చేసుకున్నట్టు అగస్త్య ఉన్న రూమ్ లోకి నడిచాడు
అగస్త్య ప్రశాంతంగా చైర్ లో కూర్చుని ఉన్నాడు
సిట్యువేషన్ చూస్తుంటే ఇద్దరూ ఏదో బిజినెస్ డీలింగ్ కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది.
భూపతి అగస్త్య ఎదురుగా కూర్చున్నాడు
మౌనం ఇద్దరి మధ్య మారథాన్ చేస్తోంది
అగస్త్య ఏ మాత్రం తడబాటు లేకుండా భూపతి కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు.
ఆ చూపులోని భావం ఏమిటో అని భూపతి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు
అది అర్థం ఐతే దానికి తగ్గట్టు తన ప్లాన్ మార్చుకోవచ్చు
క్విక్ ప్లానింగ్ లో అగస్త్య, భూపతి లకు సాటి ఎవరూ లేరు.
ఒకరి వీక్ పాయింట్ మీద మరొకరు గేమ్ ఆడడంలో మాస్టర్స్.
ఆ కారణంగానే భూపతి అగస్త్య కళ్ళలో ఏదైనా భావం కోసం వెదుకుతున్నాడు.
ఎంతసేపు చూసినా ఏమి ఫలితం లేకపోవడంతో భూపతి అసహనానికి లోనయ్యాడు
“ఆల్రైట్ అగస్త్య… విదిశను చూపుతాను.” అంటూ తనవాళ్లకు సైగ చేశాడు
అగస్త్య కూర్చున్న సీట్ క్రింద ఉన్న ఫ్లోర్ నెమ్మదిగా ఓపెన్ అయ్యింది
క్రింద ఉన్న గ్లాస్ డోర్ ఓపెన్ అయ్యింది.
సముద్రపు నీటిలో ఉన్న లైఫ్ బోట్ లో విదిశ కట్టబడి ఉంది
తనకు ప్రాణానికి ప్రాణమైన విదిశను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అగస్త్య
గుండెలు మెలిపెట్టినట్టు ఉంది
అపురూపంగా గుండెలో దాచుకున్న తన విదిశ…
నీటిలో ప్రాణం కోసం పోరాడుతూ… ఒక నీచుని స్వార్థానికి బలి కాబోతూ…
ఇది చూడడానికా తాను ఇంకా జీవించి ఉన్నాడు
అడుగు క్రింద పెడితే ఎక్కడ కందుతుందో అన్నంత సుకుమారం విదిశ…
ఎండకు ఎండుతూ ఒక అనాధలా తన ముందు నిస్సహాయంగా…
దేవుడా… తనకు ఇంత శిక్షా?
తనకు ఏమైనా పరవాలేదు కానీ ప్రాణానికి ప్రాణం … తనలో మరో రూపం విదిశకు చిన్న నొప్పి కలిగినా భరించలేకపోతున్నాడు.
ప్రేమంటే తనను తాను మరిచిపోవడమా లేక తానే మారిపోవడమా…
తన ప్రయత్నం లేకుండానే జరుగుతున్న సాదారణ ప్రక్రియలా ఉంది.
ప్రేమ ఎందుకు ఇంత శక్తివంతమో ప్రేమలో పడితే తప్ప తెలియదేమో.
నిన్న ఎవరో తెలియని వ్యక్తి నేడు సర్వస్వం అవ్వడం … తను లేకుండా జీవించలేకపోవడం ఏమిటి…
భూపతి అగస్త్య ఫీలింగ్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు
అగస్త్య తన ఫీలింగ్ పేస్ పైన కనపడకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ )
రాజమండ్రిలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో విశిష్ట వ్యక్తులకు అందించే ప్రతిభా పురస్కారానికి స్మార్ట్ రైటర్ సురేంద్రను ఎంపికచేసి ప్రముఖుల సమక్షంలో అవార్డు ను అందజేశారు.