(2)
భయం గుప్పిట తెరుచుకుంటుంది.చీకటితొలిగి వెలుగు అప్పుడప్పుడే భయంభయంగా పర్చుకుంటుంది.ఒక్కసారిగా నార్త్ అవెన్యూ ప్రాంతంలో కలకలం ప్రారంభమైంది.చాలారోజులతర్వాత మళ్ళీ పోలీస్ వెహికల్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి.దుమ్ముపట్టివు న్న ఆ రోడ్లు మీద దుమ్మురేపుకుంటూ వెళ్తున్నాయి
క్లూస్ టీం,అంబులెన్స్ పోలీస్ వెహికల్స్…
ఓబీ వ్యాన్స్ ముందే అక్కడికి చేరుకున్నాయి.ఇలాంటివార్తలను వార్చివడ్డించి రేటింగ్ పెంచుకునే అవకాశాన్ని అవెలా వదులుకుంటాయి.యాంకర్స్ రెడీగా వున్నారు…హెడ్ లైన్స్ కు మసాలా దట్టించడానికి.ప్రింట్ మీడియా వెబ్ మీడియా కాచుక్కూచుంది.
ఈ వార్త అప్పటికే జనంకు బ్రేకింగ్ న్యూస్ గా చేరడంతో అక్కడికి చేరుకుంది.
హరికథను వచ్చే జనం కన్నా ఈ హత్యోదంతం చూడ్డానికి వచ్చిన జనం కొన్నిరెట్లు ఎక్కువగా వున్నారు.
క్రైమ్ సీన్
నార్త్ అవెన్యూ ప్రాంతం
చుట్టూ ఇనుప కంచె.దాదాపు తుప్పుపట్టుకుపోయిన ఇనుపకంచె .
ఇనుపకంచెకు మధ్యలో ఇనుపతీగలతో అల్లబడినట్టు వున్న పురాతనకాలపునాటి తుప్పుపట్టిన ఇనుపతలుపు,దానికి పాతకాలంనాటి తాళపుకప్ప.
ఇనుపుకంచె రక్తంతో తడిసిపోయింది.తాళపుకప్ప మీద రక్తపుమరకలతో చేతిగుర్తులు.
అక్కడ చెల్లాచెదురుగా వున్నా నాలుగు మృతదేహాలు.
అందులో ఇద్దరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా వున్నాయి.పెద్దబండరాయి తో తలమీద బాదినట్టు వున్నాయి.
క్లూస్ టీమ్ తనపని తానూ చేసుకుపోతుంది.ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ తమ పనిలో బిజీగా వున్నారు.ఎక్కడెక్కడ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయో చెక్ చేస్తున్నారు.వాటిని కలెక్ట్ చేస్తున్నారు.
డీసీపీ చతుర్వేది సంఘటనాస్థలానికి చేరుకున్నాడు.సిఐ ఎస్సై స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసారు.
“డెడ్ బాడీస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? డీసీపీ చతుర్వేది అడిగాడు.
“నాలుగు డెడ్ బాడీస్ దొరికాయి సర్ ..నాలుగు ముప్పయేళ్ల లోపు వున్న యువకులవే సర్…ఐదు ట్రైన్ టికెట్స్ దొరికాయి సర్..దీన్ని బట్టి వీళ్ళతో మరొకరు కూడా ఉండాలి సర్?వీళ్ళతో పాటు ఒక మహిళ కూడా ఉండాలి.వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చినట్టు టికెట్స్ ను బట్టి తెలుస్తుంది సర్ ..”
“మరి ఆ లేడీ డెడ్ బాడీ ఉందా? డీసీపీ అడిగాడు.
“లేదు సర్…చుట్టుపక్కల అంతా గాలించాం.ఎక్కడ ఐదో వ్యక్తి ఉన్నట్టు ఆధారాల్లేవ్ సర్?సిఐ వినయంగా చెప్పాడు..
అప్పటికే మీడియా డీసీపీని చుట్టుముట్టింది.
“చాలారోజుల తర్వాత నార్త్ అవెన్యూలో కలకలం మొదలైంది.ఇప్పటివరకూ మీ పోలీస్ లు ఏమీ చేయలేకపోతున్నారు..దీనికి మీ వివరణ ఏమిటి?ఓ టీవీ ఛానెల్ విలేకరి అడిగాడు.
“ఇంతకూ చనిపోయినవారి గురించి ఏమైనా తెలిసిందా ?మరో విలేకరి ప్రశ్న.
కెమెరా లెన్స్ డెడ్ బాడీ ల మీద ఫ్లాష్ ను ఫ్లాష్ చేస్తూనే వున్నాయి.
“పోస్ట్ మార్టం అయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయి.కేసు ఇప్పుడే ఓపెన్ అవుతుంది కదా…ముందు మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి?అంటూ ముందుకు కదిలాడు.మీడియా డీసీపీని వదిలిపెట్టడం లేదు.
ఒక్క మీడియాకు సంబంధించిన ప్రతినిధి తప్ప.
అవాస్తవాలను ,సంచలనాలను ఫ్లాష్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళను పక్కదోవ పట్టించడం ఇష్టం లేని మీడియా అది.
ప్రతీచోటా మంచిచెడులకు ఉంటాయి.మీడియాలో కూడా అందుకు మినహాయింపు కాదు.
నాలుగుమృతదేహాలను అంబులెన్స్ లోకి తరలిస్తున్నారు.
నిశ్శబ్దంగా మెల్లిగా ఆ జనంలో వున్న డెబ్భైయేళ్ల వృద్ధుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు.
రైల్వే స్టేషన్ లో దిగిన ఆ అయిదుగురు వ్యక్తులను చూసిన వృద్ధుడే అతను.
(వాళ్లతో వచ్చిన ఆ అమ్మాయి ఏమైంది? ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరు?నార్త్ అవెన్యూ లోకి అడుగుపెడితేనే తెలుస్తుంది..)