మరి పెదవులు ఏం పాపం చేసాయి..అయినా గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది…పెదవులకు…శ్రీమతి అంటే ప్రేమ వున్నవాళ్లు…వంట ఎందుకు చేయరు?

స్పెషల్ వంట ఫర్ ప్రియమైన శ్రీమతి
పొద్దున్నే కాస్త బద్దకించి రాత్రి నేను ఇంత అందంగా బద్దకించి నిద్రపోవడానికి కారణమైన శ్రీమతికి ఏంచేయాలి? తను ముద్దుగా నిద్రపోతోంది.భార్య అందాలు కళ్ళు తెరిచినప్పుడు కాదు..నిద్రలోనే చూడాలి…నుదిటి మీద చిన్న ముద్దుతో గుడ్ మార్నింగ్ చెప్పి కదిలాను…”మరి పెదవులు ఏం పాపం చేసాయి..అయినా గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది…పెదవులకు”ఒక కన్ను తెరిచి నాలుగు మాటలు మాట్లాడి మళ్ళీ ఏమీ తెలియనట్టు భార్యను చూస్తే మొగుడికి ముద్దో మూడో రావడం గ్యారంటే కదా…
ఆ ముద్దును మూడ్ ను బాలన్స్ చేసి రెంటికీ న్యాయం చేసి …కిచెన్ లోకి వచ్చాను.
కుక్కర్ లో కోడిగుడ్లు ఉడుకుతున్నాయి.హెల్మెట్ లేకుండా ఉల్లిపాయలు తిరిగితే కన్నీళ్లొస్తాయని అర్థమైంది.ఎప్పుడూ నేను బైక్ మీద వెళ్లినా..”ఏమండీ జాగ్రత్త..హెల్మెట్ పెట్టుకున్నారుగా..అని అడిగే శ్రేమతి ప్రేమను చూసి కన్నీళ్లొచ్చాయో…ఉల్లిపాయలు తరిగితే వచ్చాయో…తెలియట్లేదు….
ఉడికిన కోడిగుడ్లు పొట్టుతీసి వాటిని రెండుగా చీల్చి…పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేగించి…కట్‌ చేసిన గుడ్లను వేసి కాసింత పసుపు మరికాసింత కారం..కూసింత మిరియాలపొడి చల్లి….కొద్దిసేపు వాటి మానాన వాటిని ఉడకనిచ్చి మూతతీసి చూస్తే బాయిల్డ్ ఎగ్ ఫ్రై ముద్దొస్తూ కనిపించింది
ఆశీర్వాద్ గోధుమ పిండితో చపాతీ చేసాను కానీ చపాతీలు రకరకాల షేపుల్లో వచ్చాయి.
పిండి తడపడం..కాసిన్ని పాలుపోసి బాగా పిసికి ఉండలుగా చేసి కాసింత నూనె తీసుకుని ట్రయాంగిల్ షేప్ లో మడతలు చేసి కాలిన పెనంమీద కాసింత నూనె వేసి చపాతీలు తయారుచేస్తే సూపర్బ్ గా వుంటాయని మా ఆవిడ ఆషాడంలో పుట్టింటికి వెళ్ళినప్పుడు చెప్పింది.కానీ నన్నొదిలి ఉండలేక ఆషాఢంలోనే వచ్చేసింది.
మా ఆవిడను మెల్లిగా నిద్రలేపి బ్రష్ లో పేస్ట్ వేసి నేనే పళ్ళుతోమించి…టవల్ తో మొహం తుడిచి కిచెన్ ఫ్లాట్ మీద కూచోపెట్టి..(ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా లాంటి ప్రశ్నలొద్దు) చపాతీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ,దానితో పాటు నా ప్రేమ కలిపి తినిపిస్తుంటే ఆప్పుడప్పుడు తన అందమైన చేతివ్రేళ్ళతో నా క్రాఫ్ చెరిపేస్తూ బ్రేక్ ఫాస్ట్ ను ఎంజాయ్ చేస్తూ..కాసిన్ని కన్నీళ్లతో నన్ను గట్టిగా హత్తుకుని అంది.
శ్రీమతి అంటే ప్రేమ వున్నవాళ్లు…వంట ఎందుకు చేయరు?
నిజమే వారంలో ఒకసారి మీరెందుకు వంట చేయరు? వారంలో ఆర్రోజులు తను చూపించిన వందరెట్ల ప్రేమకు బదులుగా నా భార్యకు ఇది చిన్న సర్ ప్రయిజ్ గిఫ్ట్ …
కానీ మా ఆవిడ రౌడీ… ఒప్పుకోదు…మీరే నాకు పెద్ద గిఫ్ట్ అంటుంది…
ఇంతకీ నా పేరేమిటో తెలుసా..
మా ఆవిడకు భర్తను మిస్టర్ మిసెస్ ను ..ఇంతకన్నా నాకు మంచి పేరేముంటుంది.?
(ఒక గొప్ప అనుభవం..అంతకన్నా గొప్ప అనుభూతి…మీ జీవితంలోని రొమాంటిక్ మెమోరీస్ పంచుకోవాలనుకుంటే…ఇలాంటి కథనాలు మీరూ రాసి పంపించవచ్చు …భార్యలను/భర్తలను ప్రేమించే భార్యాభర్తలకు..రొమాంటిక్చీ కపుల్ కు హార్టీ వెల్ కం ..చీఫ్ ఎడిటర్)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY