పిల్లలతో హడావిడిగా ఉండే స్కూల్ నిశబ్ధంగా ఉంది…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (09-07-2017)

(గత సంచిక తరువాయి)
ఆంటీ చక్కగా చేసిన కేసరి మా ముందు ఉంచింది. మొహమాటం లేకుండా నేను ఒక పట్టు పట్టాను.
తరువాత ప్రేయర్ తో క్లాస్ అయిపోవడం వల్ల మేము వెనుదిరిగాం.
ఏదైనా ఆదివారం బోర్ కొట్టకుండా ఉండడానికి నాకో టైం పాస్ దొరికింది.
మరుసటి ఆదివారం…
ఉదయం 9 గంటలు…
అప్పుడే టిఫిన్ తిని టీవీలో వస్తున్న ‘హీ మాన్’ ప్రోగ్రాం చూస్తున్నా.
ఇంతలో మా జూనియర్స్ లో మెంబెర్ అయిన చిన్నా వచ్చాడు.
“అన్నా! బాలవికాస్ ప్రోగ్రాం ఈ రోజు పొద్దున్నే మన స్కూల్ లో పెట్టారు. పోదాం రా” అంటూ పిలిచాడు.
అంతలో హీ మాన్ కూడా అయిపోవడంతో మా జూనియర్ బాచ్ కూడా బాలవికాస్ ప్రోగ్రాం పోవడానికి ప్లాన్ చేస్తుండడంతో నేను కూడా సరే అన్నా.
టైం ఉదయం – 9.30
కేజేక్స్ స్కూల్.సోమవారం నుండి శనివారం వరకు పిల్లలతో హడావిడిగా ఉండే స్కూల్ నిశబ్ధంగా ఉంది.
జూనియర్ క్లాస్ జరిగే ఏరియాలో కొంత మంది ఉన్నారు. అందరూ వైట్ డ్రెస్ వేసుకుని చక్కగా ఉన్నారు. కొంత మంది తెలిసినా చాలా మంది కొత్తగా ఉన్నారు.
జూనియర్ క్లాస్ చివరలో ఒక రూమ్ లాంటిది ఉండడం సాదారణంగా అందరికి తెలుసు. దానికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అందులో ఏమి ఉందో ఎవరికీ తేలియదు.
స్కూల్ కి సంబందించిన మెటీరియల్ ఏదో ఉందని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు.
అది ఆ రోజు ఓపెన్ చేసి ఉంది.
అప్పటిదాకా నీరసంగా ఉన్న నేను ఒక్కసారిగా హుషారుగా మారాను.
తెలిసిన వారు అందరూ సాయిరాం అని పలకరిస్తున్నా నా చూపు మాత్రం తెరిచిన ఆ రూమ్ వైపే ఉంది.
ఇంతలో ఆంటీ వచ్చి సాయిరాం విష్ చేసింది. నాకు అప్పుడు అర్థం కొంచెం అయ్యింది.
బాలవికాస్ తిరుపతిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆంటీ భవాని నగర్ లో ఉండడం వల్ల మాది భవాని నగర్ బ్రాంచ్ అయ్యింది.
అలా చాలా బ్రాంచెస్ నుండి జనం వచ్చారు.
ఒకరికి మరొకరు ఎదురుపడ్డా సాయిరాం అంటూ విష్ చేస్తున్నారు. అది మనం హలో అని విష్ చేసుకోవడంలా ఉంది. అదే విషయం మా చిన్నాగాడిని అడిగాను.
అవును అన్నట్టు తల ఊపాడు.
నా చూపు మాత్రం ఇంకా ఆ తెరిచిన రూమ్ పైనే ఉంది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY