మీ ఇష్టం పుస్తకం ఖరీదు అరవై రూపాయిలు మాత్రమే…మీ విలువైన జీవితాన్ని ఎలా ఇష్టంగా మార్చుకోవాలో తెలుసుకోవడానికి మీరు ఖర్చు చేసే నిముషాలు ఎన్ని?

మనకు నచ్చిన పుస్తకం చదవొచ్చు..మనకు ఇష్టమైన విధంగా బ్రతకొచ్చు.మన ఇష్టాలు ఇతరులకు కష్టాలు కలిగించనంత వరకు…మీ ఇష్టం మీదే..కానీ ఆ ఇష్టం మీకు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుందా ?శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా?
ప్రముఖరచయిత విజయార్కె మీ ఇష్టం పుస్తకం రివ్యూ …
మీ ఇష్టంలో విజయార్కె చెప్పిన మాటలు
విజయార్కె స్పీకింగ్ లో…
ఈ ప్రపంచంలో ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకొచ్చు…ఒకరి ఆ ఇష్టం ఇతరులకు నష్టం చేయనంత వారు…
“రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను ‘అంటాడు.నా ఇష్టం అనే పుస్తకం కూడా రాసాడు.ప్రతీ మనిషి తన మనసుకు నచ్చినట్టు తన ఇష్టమున్నట్టు బ్రతకొచ్చు.కానీ అలా బ్రతికే ముందు ఆ ఇష్టం ఇతరులకు కష్టం కలిగిస్తుందా?
ఆఇష్టం మనకు నష్టం కలిగిస్తుందా?అని ఆలోచించాలి.ఈ పుస్తకం ఉద్దేశం కూడా అదే.
నేను రాసింది…ఇతరులకు ఇష్టమైతే పాటించమని.
ఇష్టం వేరు …ఆ ఇష్టం వెనుక వుండే సాధ్యాసాధ్యాలు వేరు….వాటి నేపథ్యాలు వేరు.
“నా ఇష్టం నేను మందు కొడతాను…అంటే ఓకే …ఇంట్లో కూచోని లేదా పర్మిట్ రూమ్ లో కూచోని మందు కొట్టొచ్చు..కానీ మందు ఒక వ్యసనమని…త్రాగడానికి బానిసలు అయితే మీరు పాతాళానికి వెళ్తారని తెలుసుకుంటే ..తెలివిగా మీ ఇష్టాన్ని మార్చుకుంటే మంచిది…
మీరు మీలా మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు..
“నా ఇష్టం నేను బట్టలు లేకుండా తిరుగుతానంటే “చట్టం ఒప్పుకోదు …సమాజం ఊరుకోదు.
అయితే ఒకటి నిజం
ప్రతీ మనిషి తనకు ఇష్టం వచ్చినట్టే బ్రతకాలి..కానీ ఆ ఇష్టం నిర్మాణాత్మకంగా మనం అంచెలంచెలుగా ఎదిగేందుకు ఉపయోగపడాలి.
సద్దాం హుసేన్
బిన్ లాడెన్
హిట్లర్ లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు…ఒకొక్కరు ఒకోలా విషాదకరమైన చావును ఆహ్వానించారు.
ఒకరి అభిప్రాయాలూ ఒకరు గౌరవించుకుని లేదా తెలుసుకుని ఇతరులకు మన ఇష్టం కష్టం/నష్టం కలిగించకుండా బ్రతకాలి.
కోపాన్ని ఇలా జయిస్తే నాకు ఇష్టం
ఇలా నవ్వడం నాకుఇష్టం
ఇలా సక్సెస్ సాధించడం నాకు ఇష్టం అంటూ…
నా ఆలోచనలు లేదా రాయాలనుకున్న ఇష్టమైన విషయాలు ఈ పుస్తకంలో రాసాను.
ఇందులో ఇష్ఠమైనవి గుర్తించి ఇష్టపడి పాటించండి.
మీరు మీ ఇష్టం ఏమిటో..మీ ఇష్టమొచ్చినట్టు ఎలా బ్రతకాలని అనుకుంటున్నారో.ఒక కాగితం మీద రాసుకోండి.
ఇన్నాళ్లు మీరు మీ ఇష్టం వచ్చినట్టే బ్రతుకుతున్నారా?
ఇష్టాన్ని చంపుకుని బ్రతుకుతున్నారా ?

(నేను కోరుకున్న లక్షణాలు వున్న) ఇష్టమైన జీవిత భాగస్వామి ని పొందలేకపోయానని అనుకుంటున్నారా?
కొన్ని ఇష్టాలు తీరకపోవచ్చు..అలా అని నిరాశ పడకుండా కష్టమైన విషయాన్ని ఇష్టమైన విషయంగా మార్చుకోవచ్చు.
మీ ఇష్టం పుస్తకం kinige.com ద్వారా అందుబాటులో వుంది.ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు ఈ పుస్తకాన్ని పొందవచ్చు.
ఈ పుస్తకంలో కొన్ని పేజీలు ఫ్రీ డౌన్ లోడ్ ..అవి చదివి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు.

Free PDF Preview

http://preview.kinige.com/previews/8400/PreviewMeeIshtam37754.pdf

NO COMMENTS

LEAVE A REPLY