జానపద నవలల ప్రాభవం మళ్ళీ మొదలైంది…కినిగెలో జానపద నవలా ప్రభంజనం .*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి” అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. మాయాశిల్పం-మంత్రఖడ్గం,

జనవరి 23 ( మేన్ రోబో బ్యూరో )
పాఠకులను కొన్ని దశాబ్దాలకు పూర్వం ఉర్రూతలూగించిన జానపద రచనలు మళ్ళీ ఊపిరిపోసుకున్నాయి.
బేతాళకథలు చందమామ కథలు పేదరాశి పెద్దమ్మ కథలు సింధుబాద్ సాహసకథలు ,మంత్రతంత్రాలు కత్తియుద్ధాలు సాహసాలు … సరికొత్త ఊహాప్రపంచంలో చిన్నారులనే కాదు పెద్దలనూ మెస్మరైజ్ చేసే జానపద నవలలు.
చేతిలో ఇమిడిపోయే ప్యాకెట్ సైజు పుస్తకాలు …ఒకప్పటి మధుర జ్ఞాపకాలు .
కాలక్రమంలో క్రైమ్ ,నాన్ ఫిక్షన్ ,లవ్ ,రొమాన్స్ ..కామెడీ ,హారర్ ఇలా ఎన్ని ప్రక్రియల్లో రచనలు వచ్చినా జానపద నవలలు మళ్ళీ రాజ్యమేలుతూ నాటి రాజులకాలాన్ని,అప్పటి అనుభూతులను మన ముందుకు తీసుకువస్తున్నాయి.
ఇ బుక్స్ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన కినిగె లో జానపద నవలలు కొలువుతీరాయి.
ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకులకు అందుబాటులో వున్నాయి జానపదనవలలు.ఒకేఒక క్లిక్ దూరంలో.
ఒక అందమైన ఊహాప్రపంచాన్ని ,సాహసాలను, ఆహ్లాదాలను మూకుమ్మడిగా అందిస్తున్నాయి జానపద నవలలు.
మధుబాబు,అడపా చిరంజీవి, శ్రీసుధామయి నవలలు వరుసగా టాప్ టెన్ లో అమ్మకాల్లో ప్రథమస్థానంలో నిలుస్తూ పాఠకుల్లో పుస్తకాలు ఇంకా బ్రతికే వున్నాయన్న అక్షరసత్యాన్ని చెబుతున్నాయి.
దాదాపు ముప్పయి తొమ్మిదేళ్ల తరువాత విజయార్కె రాసిన తొలి జానపద ” మాయాశిల్పం…మంత్రఖడ్గం” నవల విడుదలైంది.
జానపద నవలలతో మీకున్న అనుబంధాన్ని మీరూ మేన్ రోబో తో షేర్ చేసుకోవచ్చు.
మీరు చదివిన తొలి జానపద రచన గురించి తెలియజేయవచ్చు.
పుస్తకాలను / నవలలను సమీక్షించవచ్చు

మీ రచనలను మాకు మెయిల్ చేయవలిసిన మెయిల్ ఐడి

manrobocreations@gmail.com
మాయాశిల్పం నవల లింక్

http://kinige.com/book/Maya+Silpam+Mantra+Khadgam
శ్రీసుధామయి నవలల లింక్

http://kinige.com/book/Bhutala+Deevi+Bhetala+Mantrikudu
అడపా చిరంజీవి నవల లింక్

http://kinige.com/book/Jittulamari

 

 

NO COMMENTS

LEAVE A REPLY