మధుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు…ఎమోషన్స్ ను అలవోకగా పాఠకుల్లోకి ట్రాన్స్మిట్ చేయగల హిప్నాటిస్ట్ …కాలాన్ని ముందుకు తీసుకువెళ్లి,అవసరమైతే వెనక్కి తిప్పగల అక్షర మేథావి.

మధుబాబు
పాఠకులకు పరిచయం అక్కరలేని పేరు
షాడో
పాఠకులతో విడదీయలేని అనుబంధం
షాడో ఎక్కడో ఉన్నాడనే అందమైన భ్రమను కలిగించిన సుప్రసిద్ధ రచయిత.
పాత్రల ప్రవేశానికి ముందే ఆ పాత్ర ధీరోదాత్తతను,ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు చూపించే ఇంద్రజాలికుడు .
ఎమోషన్స్ ను అలవోకగా పాఠకుల్లోకి ట్రాన్స్మిట్ చేయగల హిప్నాటిస్ట్
కాలాన్ని ముందుకు తీసుకువెళ్లి,అవసరమైతే వెనక్కి తిప్పగల అక్షర మేథావి.
రచయితకు అభిమాన రచయిత
షాడో లా కాదు,తనలా షాడో ఉంటాడు.తన నీడే షాడో .
షాడో సృష్టికర్త మాత్రమే కాదు.
డిటెక్టివ్ సాహిత్యంలో కొత్త ఒరవడికి నాంది పలికిన కర్త కర్మ క్రియ.
ఎంత వద్దనుకున్నా మీ ప్రభావం పరోక్షంగానైనా పడేలా చేయగల శైలి..,
తనలా రాయకతప్పని పరిస్థితిని రచయితలకు కలిగించిన మహారచయిత.
ఇది కొందరు రచయితలకే సాధ్యమయ్యే అద్భుతం
సంవత్సరంలో ఒకేఒకరోజు చెప్పే శుభాకాంక్షలు కాదు..
మధుబాబు అన్న పేరు సాహిత్యం ఉన్నంతవరకూ ఉంటుంది.
ఆ పేరును వెన్నంటే షాడో …
ఇది మేన్ రోబో శుభాకాంక్షల ఆకాంక్ష
మధుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు…

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY