సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ సమస్యల శత్రువులతో పోరాడి గెలిచిన హీరో సుమన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ( 28 -08 -2020 )

(విజయార్కె)
ఆగష్టు 28 హీరో సుమన్ పుట్టినరోజు
సుమన్ గారితో పరిచయం దాదాపు ముప్పయ్యేలా నాటిది.ఆంధ్రభూమి వీక్లీ లో సుమన్ గురించి ” జైలు గోడలమధ్య హీరో సుమన్ ” సీరియల్ రాయడంతో మొదలైన పరిచయం.ఇప్పటికీ చెక్కుచెదరని సంస్కారం,స్నేహం.మొట్టమొదటి సారిగా ఒక హీరో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నాడు.బిజీగా ,ప్రముఖ హీరోగా స్టార్ స్టేటస్ లో వున్నా వ్యక్తి సడెన్ గా జైలు గోడల మధ్య చేరినా,అర్థరాత్రి అరెస్ట్ జరిగినా కృంగిపోకుండా ,మనోస్థయిర్యంతో ,తను తప్పుచేయలేదన్న నమ్మకంతో పోరాడి నిర్దోషిగా విడుదల అయ్యారు.
చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకునేవారికి సుమన్ జీవితంలో ఎదుర్కున్న విషాదాలు వ్యక్తిత్వవికాస పాఠాలు.
నేటిభారతం,తరంగిణి ,సితార మొదలు పెద్దింటల్ల్దుడు బావ బావమరిది ,ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి సూపర్ హిట్స్ ,
అన్నమయ్య లాంటి అద్భుత చిత్రంలో శ్రీవేంకటేశ్వరుడి పాత్ర.
నటుడిగా తన ప్రయాణం ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే.
హీరో సుమన్ కు మేన్ రోబో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
సుమన్ పోరాడి గెలిచి వ్యక్తిత్వ వికాసానికి ఐకాన్ గా నిలిచిన ..
” జైలు గోడలమధ్య హీరో సుమన్ “
పుస్తకం లింక్ …

https://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

NO COMMENTS

LEAVE A REPLY