ఉందిలే మంచికాలం ముందూ ముందునా…సస్యశ్యామల భారతంలో అన్నపూర్ణ రైతన్నల రూపంలో…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి( 02-08-2020)

విద్యారత్న ,ప్రముఖరచయిత,సామాజిక సేవలో నిత్యం ముందు నిలిచే,మానవతావాది,సృజనాత్మకతకు పెద్దపీట వేసే విద్యావేత్త,ఉపాధ్యాయుడు,రైతు,అన్నింటికీ మించి మానవత్వాన్ని తన అభిమతమని చెప్పే స్నేహశీలి…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి..తన మూలలను మరిచిపోకుండా ఎందరికో స్ఫూర్తిని ఇస్తూ పంటపొలాల్లో రైతుగా మారాడు.ఓ వైపు విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ,
మరోవైపు రైతుగా పొలంలోకి వెళ్లి రైతన్నలకు బాసటగా నిలిచారు.
తన భావాలను అక్షరాల్లోకి అనువదించారు .
పచ్చని పంటచేలలో
రైతన్నల సేద్యంలో
కరోనా కష్టకాలంలో
రాజనాలు పండించే
రైతురాజులకు వందనాలు.
పచ్చని ప్రకృతిలో
కన్నెర్ర చేసిన కరోనా మహమ్మారి
ప్రపంచమంతా అతలాకుతలం
సస్యశ్యామల భారతంలో
అన్నపూర్ణ రైతన్నల రూపంలో
విద్య చెప్పే గురువులు
వైద్యసేవ చేసే ‘ వైద్య నారాయణులు”
రక్షకులు ,సమాజసేవకులు
పేదప్రజలకు అండగా నిలిచిన
ఎందరో మహానుభావులు.
వందనాలు… అభివందనాలు

కరోనా మహమ్మారిని
పొలిమేరల్లోకి తరిమికొడదాం
మానవాళిని రక్షించుకుందాం
మన ఐక్యతను చాటిచెబుదాం

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY