అంతర్జాలంలో కథల ఇంద్రజాలం,ఆహ్లాదాల అక్షరజాలం ..కహానియా …ఆశ స్వప్నిక పల్లపోలు ప్రత్యేక కథనం

( ఆశ స్వప్నిక పల్లపోలు)

కహానియా
ప్రపంచవ్యాప్తంగా వున్నా తెలుగువారికి చేరువైన అంతర్జాల పత్రిక.
మనకు నచ్చిన కథ/ సీరియల్ చదువుకునే అవకాశం.పత్రిక అందుబాటులో లేనిచోట మీ ఇంట్లోనే సిస్టం లో/ల్యాప్ టాప్ లో/మీ మొబైల్ లో చదువుకునే వెసులుబాటు.కథ/సీరియల్ డిస్క్రిప్షన్ చదివి నిర్ణయించుకునే అవకాశం.
రచయితలు తమ రచనలకు పారితోషికం /రాయల్టీ అందుకోవచ్చు.
పాఠకులు సైతం రచయితలుగా మారవచ్చు.
వర్తమాన రచయితా మొదలు,ప్రముఖరచయితల రచనలు కహానీయాలో కొలువుతీరాయి.
(నూతన సంవత్సరం సందర్భంగా కహానియా తెలుగు విభాగం ఎడిటర్ ఆశ స్వప్నిక పల్లపోలు మేన్ రోబో కోసం అందించిన ప్రత్యేక కథనం)
పెరుగుతున్న ఆధునిక ప్రపంచంతో, మన కథల ప్రపంచం కూడా అంతే ఆధునికతను సంతరించుకుని “కహానియా” అనే ఒక సరికొత్త ఆలోచన 2016లో, ఒక సాంకేతిక వేదికకు నిలయమైంది
“కహానియా” ఒక కథల మాధ్యమం, సాంప్రదాయ కథకు డిజిటల్ రంగులు అద్ది, అందరికి అందుబాటులో ఉండే విధంగా, లక్షల మంది పాఠకులకు చేరువయ్యేలా,, అరచేతిలోనే 30,000 పై చిలుకు కథలను, 11 ప్రాంతీయ బాషలలో మనకు అందిస్తోంది “మన కహానియా”
అందరి అభిరుచికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఒక బహుళ సాంస్కృతిక విభాగం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే అన్ని వయస్సుల వారికి తగ్గట్టుగా కథలు అందుబాటులో ఉన్నాయ్.
“కహానీయతో నాలుగు సంవత్సరాల అనుబంధం నాది. చాలామందికి రాయాలనే కోరిక, రాసే సత్త ఉంటుంది కానీ అవకాశాలు ఉండవు. నేను కూడా డైరీలో రాసి, అల్మారాలో దాచిపెట్టుకునేదాన్ని. అలంటి నన్ను కహానియా తమ వేదిక పై నా కథలను ప్రచురించే అవకాశం ఇచ్చారు, ఆ ఒక్క అవకాశమే నన్ను లక్షల మంది పాఠకులకు దగ్గర చేసింది. ఏడూ వందల ఫాలోవర్స్ ని సంపాదించుకునేలా చేసింది. అంతే కాదు నాణ్యమైన కథలను రాసే రచయితకు తమ కథకు తామే ప్రైసింగ్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇప్పెటిదాకా 45 కథలను ఒక్క కహానియా లో మాత్రమే ప్రచురించాను, అన్ని జనాదరణ పొందినవే. ఇంతటి ఆదరణ నా రచనలకు అందించిన కహానియాకు సర్వదా నేను కృతజ్ఞురాలిని” అని అన్నారు అభిసారికగారు, రచయిత రచయితలను ప్రోత్సహించేందుకు, రెండు సరికొత్త ప్రోగ్రాములకు రూపకల్పన చేసింది “కహానియా” అవే
‘కహానియా లాంచ్‌ప్యాడ్’ కొత్త రచయితలను, ప్రచురణ సంస్థలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది. ‘కహానియా కనెక్ట్’ రచయితలు మరియు చిత్ర పరిశ్రమల మధ్య అనుసంధానం చేస్తుంది.
“మేము సినిమా లేదా వెబ్ సిరీస్ లకు సరిపోయే కథలను ఎంపిక చేసి వాటిని నిర్మాతలు మరియు దర్శకులకు పంపిస్తాము ఆలా సాయి తేజ దేశరాజ్ గారు కహానియాలో రాసిన కథే ప్రశాంత్ వర్మ కు నచ్చి, రాజశేఖర్ గారిని మెప్పించి తీసిన సినిమా “కల్కి” గా వచ్చింది” అని పల్లవ్, CEO వివరించారు.
కహానియా బృందం చిత్రపరిశ్రమవారితో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తుంది, కథ నేరేషన్ సెషనుని ఏర్పాటు చేసి, కథ ఆమోదించబడితే, రచయిత తరపున, అగ్రీమెంటులు, రెమ్యూనరేషన్ మరియు ఇతరవిషయాలలో రచయితకు సహాయపడుతుంది.
“కథ యొక్క కాపీరైట్ రచయిత వద్దే ఉంటుంది, చెల్లింపులు కూడా సుమారు 70:30 ప్రాతిపదికన పెద్ద మొత్తం రచయితకు చేరుతుంది. మేము మా కథల బ్యాంకును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కొత్త రచయితలనుప్రోత్సహించడానికి, రచయితలు మరియు చిత్రనిర్మాతలను కలిపే మార్కెట్ కావాలనుకుంటున్నాము” అని ముగించారు పల్లవ్ గారు
జీవితం ఒక పుస్తకం అనుకుంటే….. దేవుడు మొదటి పేజీలో జననాన్నీ….. , ఆఖరి పేజీలో మరణాన్ని…. మాత్రమే రాస్తాడు…. మధ్య ఖాళీ పేజీలను మనమే మధురమైన జ్ఞాపకాలతో నింపుకోవాలి.
పాత సంవత్సరం, ‘2020’ మిగిల్చిన చెడ్డ రోజులను దాటుకుని, ఈ నూతన సంవత్సరం 2021లోని మీ పేజీలను మంచి జ్ఞాపకాలతో నింపుకోవాలని మీ “కహానియా” కోరుకుంటోంది.
మా కహానియా టీం తరపున మా పాఠకులకు, రచయితలకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ
మీ
ఆశ స్వప్నిక పల్లపోలు
ఎడిటర్ (తెలుగు విభాగం)
కహానియా

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY