సంక్రాంతి సంబురాల విశేషాలు…సుంకర కృష్ణకుమారి (13-01-2021)

( సుంకర కృష్ణకుమారి )
(విద్యావేత్త,ఉపాధ్యాయిని,సామాజిక సేవాకార్యక్రమాల్లో నిత్యం ముందు నిలిచే వ్యక్తి, వాకర్స్ క్లబ్ లో కీలకమైన పదవుల్లో ఎన్నో సామాజిక సాహితీ కార్యక్రమాలు నిర్వహించిన శ్రీమతి సుంకర కృష్ణకుమారి సంక్రాంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం …చీఫ్ ఎడిటర్ )
హైదరాబాద్ నల్లకుంటలో మాత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా లింగ ప్రకాష్,సెక్రటరీ గా సందీప్,ట్రెజరర్ గా రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు… 
ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్ ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు
మాత వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు…
ముగ్గుల పోటీ లో గెలుపొందిన వారికి . ఎమ్మెల్సీ దాయనంద్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్తా…బహుమతులు అందించారు
సంక్రాంతి వచ్చిందంటే సంబురాలు మొదలైనట్టే.
పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం. తిథితో సంబంధం లేని పండగ. ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు.భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. భోగం గలది కాబట్టి భోగి అంటారు.
ముందు గడిచిన దక్షిణాయనమంతా ఉపాసనా కాలం. ఆ కాలమంతా పలురకాల పద్ధతుల్లో భగవంతుణ్ణి ఉపాసిస్తారు. తన సాధనల ఫలితాన్ని సాధకుడు పొంది ఆనందించే సమయం భోగి అయింది. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తొలగించుకుంటారు.తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.
*శ్రీయమిచ్ఛేత్ హుతాశనాత్* అనేది వైదిక మంత్రం. అగ్ని నుండి సిరి సంపదల్ని ఆశించాలని ఆ మంత్రానికర్థం. ఈరోజు కోత్త బియ్యం, పెసరపప్పు కలబోసి కిచిడి (పొంగలి) తయారుచేసి భోగి పురుషునికి నైవేద్యం పెడుతారు.సూర్యాస్తమయము లోపు (సా.5.59) పిల్లలకు భోగి పండ్లను పోస్తారు.చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన వారికి ఉన్న బాలారిష్టాలు, ఇతర దోషాలు తొలగి పోతాయి. 
ఈ భోగి పండ్లలో రేగుపండ్లు, జీడిపండ్లు, కొన్ని చిల్లర నాణేములను, బియ్యం పిండితో చేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్ని చిన్న వేపగింజల ఆకారంలో తాల్కలు, చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఏనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి కూర్చోవడానికి చాప, దుప్పటి లాంటిది వేసి తూర్పువైపు ముఖం ఉండేలాగ కూర్చో బెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుండి క్రిందకు జారపడే లాగ పోయాలి. ఆ క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరదా పడుతూ, పోటీపడుతూ భోగిపళ్లను పోగుచేసుకుని తింటారు.
ఈ సంక్రాంతి మీకు సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటున్నాను.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY