రవీంద్రభారతిలో విజయార్కె ” విలువ” నాటక ప్రదర్శన.నాటకీకరణ రావి నాగేశ్వరరావు ,దర్శకత్వం కె.వెంకటేశ్వరరావు

నాటకాలు కనుమరుగవుతున్నాయన్న వేదనలో నుంచి స్వాంతన.నాటకాలను ఆదరించే ప్రేక్షకులు కళాహృదయులు,నాటక పరిషత్తులు నాటకాలకు ఊపిరిపోయడానికి సైన్యమై కదిలారు.
అజో విభో .కందాళం ఫౌండేషన్ ,శ్రీకళానికేతన్ ,మహతి క్రియేషన్స్ సంయుక్త నిర్వహణలో రవీంద్రభారతిలో సాహితీ సాంస్కృతిక సదస్సులు,తెలుగు రాష్ట్రాలస్థాయి నాటక పోటీలు జరిగాయి.
ఇందులో భాగంగా ప్రముఖరచయిత విజయార్కె( సాక్షి పత్రికలో ) రాసిన ” విలువ ” నాటకాన్ని ప్రదర్శించారు.నాటకీకరణ రావి నాగేశ్వరరావు,దర్శకత్వం కె.వెంకటేశ్వరరావు ,
ఇందుమతిగా డి.హేమ , చలమయ్యగా ఆదినారాయణ ,చంద్రశేఖర్ గా వేణు, పిఎ వినోద్ గా నల్ల శ్రీను,,డాక్టర్ ఆనంద్ గా రవి కుమార్ ఆయా పాత్రలకు ప్రాణం పోశారు.
విశాఖపట్నం శ్రీ కళానికేతన్ నిర్వహించిన నాటకపోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ ” విలువ”  (విజయార్కె కథ) ఈ కథను రావి నాగేశ్వరావు నాటకీకరణ చేసారు.కె.వెంకటేశ్వరరావు దర్శకత్వ ప్రతిభ ,పాత్రధారుల నటన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి.రాత్రి పదిన్నర వరకు ఈ నాటకాన్ని చివరివరకూ వీక్షించి ప్రేక్షకులు ఈ నాటకాన్ని అభినందించారు .
మేన్ రోబో పాఠకుల కోసం,మేన్ రోబో తెలుగు ఇండియా ఛానెల్ ద్వారా నాటకంలో కొంతభాగాన్ని అందిస్తున్నాం.
మీ అభినందనలు నాటకానికి దశ దిశ ఊపిరి.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY