అద్భుతం ,మాటలకు అందని ఉద్వేగం, చదువుల తల్లి మురిసిపోయిన క్షణం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

అద్భుతం ,మాటలకు అందని ఉద్వేగం ,చదువులతల్లి మురిసిపోయిన క్షణం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

( శ్రీరామ నవమి శుభాకాంక్షలు)
ప్రముఖ విద్యావేత్త ,రచయిత లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్,థింక్ రూమ్స్ కాన్సెప్ట్ తో విద్యారంగంలో కొత్త ఒరవడి తీసుకు వచ్చిన డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
అయన ఒక ఆశయం
ఆయన ఒక ఆలోచన
ఆయన ఒక ఆదర్శం
వ్యక్తిత్వ వికాసానికి ఆయన ఒక ఐకాన్
గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చిన దార్శనికుడు.
ఈ అద్భుతానికి కాలం సాక్షిగా నిలిచిన రోజు ” గుర్తుకొస్తున్నాయి,”,అంటూ ఆ రోజులను వెనక్కి తీసుకువచ్చిన రోజు.
1982 వ సంవత్సరం ,నేరడ గ్రామం ( నల్గొండ జిల్లా)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఏడు కిలోమీటర్ల నడకతో తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా ఆ పిల్లవాడు ఆ బడిలో క్రమశిక్షణతో చదువుకుని ” ఇంతితై వటుడింతై” ఎదిగిన కథను కాలయంత్రంలో వెనక్కి తీసుకు వెళ్తే...
1982 వ సంవత్సరం నేరడ గ్రామం ( నల్గొండ జిల్లా) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.ఆ నాటి ఆ పిల్లలు ఎదిగారు.అమ్మమ్మలు తాతయ్యలు అయ్యారు.కాలంతో ముందుకు వెళ్లారు.కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం పదిలంగా పరిమళిస్తూనే వున్నాయి.38 సంవత్సరాల జ్ఞాపకానికి ప్రాణం పోశారు.గురుస్థానానికి వన్నె తెచ్చారు.
ఈ సమ్మేళనానికి నాంది పలికిన వ్యక్తి ప్రముఖ విద్యావేత్త ,రచయిత లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్,థింక్ రూమ్స్ కాన్సెప్ట్ తో విద్యారంగంలో కొత్త ఒరవడి తీసుకు వచ్చిన డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి .
18 -04 -2021
అదే బడి,వెలిసిపోయిన గోడలు,అవే బెంచీలు,అదే గురువు,బడి పాతబడ్డా జ్ఞాపకాలు పాతబడలేదు గుండె గొంతుకలో వున్నాయి.
అందరినీ ఒక్కచోట చేర్చి,అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి వారితో మళ్ళీ పాఠాలు చెప్పించి,విద్యార్థుల్లా మారారు.
కొన్నివందల మంది ఉపాధాయ్యులకు ,సిబ్బందికి ఉపాథి కలిగిస్తూ,లక్షల మంది విద్యార్థులను ఉన్నతస్థానాలకు చేరుకునేలా తీర్చిదిద్దిన వ్యక్తి,ఒక విద్యార్థిలా తన గురువు ముందు అదే బడిలో,అదే బెంచీలో కుచ్చోని పాఠాలు వినడం,ఒక గొప్ప జ్ఞాపకానికి ఊపిరిపోసారు.
విద్యార్థులు ఎలా ఉండాలి.
ఉపాథ్యాయులు ఎలా ఉండాలి
తల్లిదండ్రులు ఎలా ఉండాలి..
గురువులకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి?
ఇలాంటి విషయాలకు ఓ వ్యక్తిత్వ పాఠాన్ని చెప్పారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY