స్నేహాన్ని ప్రేమిద్దాం…స్నేహంతో కలకాలం కలిసుందాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

(Happy friendship day )
స్నేహంతో కరచాలనం చేద్దాం
కర్ణుడి మైత్రి గుర్తు చేసుకుందాం
కుచేలుడి నేస్తం కృష్ణుడే స్నేహానికి ఆదర్శం
స్నేహమంటే రక్తం పంచుకోని మైత్రీ బంధం
ఒకే కడుపున జన్మించకపోయినా …
కలకాలం నిలిచుండే ఋణానుబంధం
మతాలను కలిపేది
మానవత్వాన్ని ప్రేమించమని చెప్పేది
మనుష్యుల్లోని వైషమ్యాలను తరిమేసి..
నిశ్చయంగా నిర్భయంగా నిర్మలంగా
నిలిచేది నీ వెంటే నీడై వచ్చేది..
నీ ప్రాణమై నిలిచేది స్నేహమే.

…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY