రాధామాధవీయం కమనీయమే,అక్షరాల్లో హృద్యమయ్యే అందమైన పద్యమే ” చంద్రశేఖర్ దండెం ” అక్షరాల్లో ఊపిరిపోసుకున్న ” కృష్ణప్రేమ”

( కవిత ) కృష్ణప్రేమ
( రాధామాధవీయం కమనీయమే,అక్షరాల్లో హృద్యమయ్యే అందమైన పద్యమే ” చంద్రశేఖర్ దండెం ” అక్షరాల్లో ఊపిరిపోసుకున్న” కృష్ణప్రేమ” )

ఒక పౌర్ణమి నాడు…
వెన్నెల వెలుగులో
మాయలు మరిచి
మనసుని తెరిచి
రాధను తలచిన కన్నయ్య
తలపుకు పలికి వలపని
తెలిసి కన్నయ్య ఎదపై వాలెను రాధ
కన్నయ్య కలవరింతకు
కారణమేమని కొంటెగా అడిగింది రాధ…
నీ నెమలి పింఛమంటి నయనాలలో
బందీనైన నన్ను నేను
చూసుకుందామని అన్నాడు కృష్ణయ్య
మరి నేను లేనే కృష్ణా నీ కనులలో?
బాధతో పలికింది రాధ!
ఒక చిరునవ్వు విసిరి,
పిచ్చి రాధ… అని, నింగిని చూపిస్తూ
ఆ తారలు లేనిదే చంద్రుడు ఎలా అయితే లేడో
ఈ రాధ లేనిదే కృష్ణుడు లేడు…
నాతో నీవు నీతో నేను ఇద్దరమూ
ప్రేమకు బందీలమే అన్నాడు కృష్ణయ్య!
….చంద్రశేఖర్ దండెం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY