మందుబాబుల చేతుల్లోని గ్లాసుల చీర్స్ అని మాట్లాడుకుంటాయి..సముద్రదొంగలతో మొదలైన చీర్స్…ఎందుకంటే..?

అసలు చీర్స్ అని చెప్పుకోవడం ఎప్పుడు…ఎందుకు ..ఎలా మొదలైందో తెలుసా..?
ఒక కథనం ప్రకారం…
సముద్రంలో ప్రయాణించే వారికి సముద్రదొంగల బెడదఉంటుంది.
మధ్యయుగంలో సముద్ర దొంగలు దోచుకున్న సొమ్ము పంచుకోవడానికీ, దారిలో వున్న ఒక దీవి చేరుకొని అక్కడ మద్యంతో సంబరాలు జరుపుకునేవారు.అలా ఆ దీవిలో వారు మత్తుగా తూలుతూ సంబరాలు చేసుకోవడం సరేసరి.అయితే మందు తీసుకునే ముందు అందరూ చీర్స్ చెప్పుకునేవారు.
అప్పట్లో చెక్కతో తయారుచేసిన గ్లాసులు ఉండేవి.సముద్ర దొంగలు మద్యాన్ని ఆ గ్లాసుల్లోకి ఒంపి తీసుకునేవారు.అయితే వారిలో ఓ భయం.దొంగతనం చేసిన సొత్తును స్వంతం చేసుకోవాలని వారిలోని ఏ దొంగైనా కావాలనే ఆ మద్యంలో ఎవరైనా విషం కలిపితే…(అలా కలిపేవారట).
సో..ఈ ప్రాణాపాయం నుంచి రక్షించుకోవడానికి ఆ దొంగలు ఒక ఉపాయం ఆలోచించారు.
అదే ఆపరేషన్ చీర్స్…
అంటే మద్యం గ్లాసులను ఒకదానికి ఒకటి గట్టిగా తగిలించి చీర్స్ చెప్పుకోవడం.అలా చేయడం వల్ల ఆ మద్యం ఒలికి అందరి గ్లాసుల్లోకి పడుతుంది.అలా ఒకరి గ్లాసులోని మద్యం మరొకరి గ్లాసులోకి పడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వుంటారు.
అలా సముద్రదొంగలు తమ ప్రాణరక్షణకు ఏర్పాటు చేసుకున్న చీర్స్ ఇప్పుడు ఒక స్టైల్ గా మారింది.
అంతే కాదు మరో కథ కూడా ప్రచారంలో వుంది.చీర్స్ కొడితే గ్లాసుల శబ్దానికి దుష్టశక్తులు పారిపోతాయిట.
అయితే లిమిట్ దాటిన మద్యం మనల్ని మధ్యంతరంలోనే పైకి తీసుకువెళ్తుంది.
లిమిట్ గా తాగితే లివర్ సేఫ్టీ …అన్న సినిమా డైలాగు గుర్తుంచుకోండి.
మీకు నచ్చితే ఈ ఆర్టికల్ కు చీర్స్ చెప్పి షేర్ చేయండి.అంతే కాదు మీ చీర్స్ కథలు మాకు పంపించండి.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY