అభ్యుదయం అబ్బురపడే అక్షరమై ,కవిత్వం ఎగిసిపడే కెరటమై..ఆయన కలం ఖడ్గమై …తేజారాణి తిరునగరి అక్షర కైమోడ్పు

Dr. Boyi Bhimanna (1911-2005)
ఆ అక్షరాలు అమృతాన్ని కురిపించే క్షీరధారలు
ఆ అక్షరాలు నిప్పులు వెదజల్లే చైతన్య అగ్నికణికలు
ఆ అక్షరాలు కవనానికి ఊపిరిపోసే స్ఫూర్తి ప్రదాతలు
ఒక మహాకవి పుట్టిన నెల..ఒక కళాప్రపూర్ణుడు ఉదయించిన మాసం.
అభ్యుదయం అబ్బురపడే అక్షరమై ,కవిత్వం ఎగిసిపడే కెరటమై..ఆయన కలం ఖడ్గమై …
తానే ఒక అక్షరసైన్యమై నిలిచి ,కవితాసామ్రాజ్యంలో రారాజుగా నిలిచిన పద్మభూషణుడు….
1990 ప్రాంతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఇంటర్ వ్యూ లోని కొన్ని వాక్యాలు బోయిభీమన్నగారి సమాధానాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన ఆ వయసులో అమ్మ బోయిభీమన్న గారి కవిత్వాన్ని ఆ ఇంటర్ వ్యూ ని చదివి వినిపించి నాతో చదివించారు.
కవిత్వం పట్ల ఏ కాస్తో మమకారమో ప్రావీణ్యామో ఉందంటే అది అమ్మ నాతో చదివించిన సాహిత్యమే…
సెప్టెంబర్ 19
బోయిభీమన్నగారు జన్మించిన రోజును స్మరించుకుంటూ ఈ అక్షర కథనం …తేజారాణి తిరునగరి

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Death+Sentence

 

NO COMMENTS

LEAVE A REPLY