చక్కని చిక్కని కథలు చెప్పుకుందాం డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి చిన్నారుల ప్రపంచం

మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం?స్కూల్ నుంచి రాగానే వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లలు,అదేపనిగా కార్టూన్ నెట్ వర్క్ చూసే పిల్లలు..కంప్యూటర్ ముందు గంటలతరబడి కూచుంటూ వుండే పిల్లలు.పిల్లల్లో సృజనాత్మకతకు దూరం చేసే అతిఅలవాట్లు.
పిల్లలకు ఆహ్లాదాన్నిచ్చే చందమామ కథలు చెబుతున్నామా?బాలమిత్ర కథలు ఒళ్ళో కూచోబెట్టుకుని చెబుతున్నామా?వెండిగిన్నెలో చందమామను చూపిస్తూ కథలు చెప్పే కథలు చిన్నప్పుడు చదువుకున్నాం..కానీ ఇప్పుడా ఊసే లేదుకదా?
చందమామ కబుర్లు, రెక్కల గుర్రం కథలు వింటున్నప్పుడు పిల్లలు చెవులు రిక్కించి మరి వింటారు. కాశీమజిలీ కథలు. బేతాళుడు, విక్రమార్కుడు లాంటి ఉత్కంఠ కలిగించే కథలైతే తరువాత ఏం జరిగిందో చెప్పమని పోరుతుంటారు. వాటిపై ఉండే ఆసక్తి అలాంటిది
ఇలాంటి కథల వల్ల పిల్లల్లో చురుకుదనం,సాహిత్యం పట్ల పరిచయం,సాహసాలగాథల వల్ల ఉత్తేజం,నీతి ఇలాంటివన్నీపిల్లలకు శ్రీరామరక్షగా నిలుస్తాయి.
మీ పిల్లలతో కొద్దిసమయాన్ని గడపండి.వల్ల భవిష్యత్తుకు నిరంతరం శ్రమించే మీరు వీరితో గడిపే సమయం వారికెంతో విలువైనది.
రోజు తలిదండ్రులతో గడిపే పిల్లలతో పోలిస్తే తల్లిదండ్రులతో తక్కువ అటాచ్మెంట్ వున్న పిల్లలు కొంత డల్ గా వుంటున్నారని సర్వేల వల్ల తెలుస్తోంది.
పిల్లల హోమ్ వర్క్ గురించి ఆరా తీయడం.స్కూల్ లో జరిగిన విశేషాలు తెలుసుకోవడం,వారాంతంలో పిల్లలతో కలిపి స్పెండ్ చేయడం..లాంటి విషయాలు పిల్లల్లో ఉషారును కలిగిస్తాయి.

విజయాన్ని కోరుకునేవారికోసం పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/Vijayanni+Korukune+Varikosam

gopalreddy-123

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY