“కానీ ఈ కేసును పరిశోధించడానికి మనవాళ్ళు దొరకలేదా?ఎక్కడో ఢిల్లీ నుంచి పిలిపించాలా?వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (13-11-2016)

                                  (3 )
ఆకాశాన్ని దట్టమైన మేఘాలు చుట్టేసాయి.మృత్యువు అదే తన నివాసం అన్నట్టు నార్త్ అవెన్యూ దగ్గర కాచుక్కూచున్నట్టు వుంది.ఇరవైనాలుగు   గంటల క్రితం జరిగిన బీభత్స మృత్యుక్రీడకు అక్కడ ఆనవాలు అన్నట్టు క్రైమ్ సీన్ కనిపిస్తోంది.డెడ్ బాడీస్ వున్నచోట మార్క్ చేసి వున్న దృశ్యాలు…ఎండిపోయిన రక్తపుచారికల గుర్తులు నార్త్ అవెన్యూ లోని మిస్టరీకి సాక్ష్యాలుగా  మిగిలివున్నాయి.

ఇన్ని జరిగినా నార్త్ అవెన్యూ మాత్రం అలానే వుంది.పాడుబడ్డ నార్త్ అవెన్యూ లో పాతిపెట్టబడిన రహస్యాలు ఎన్నో?ఇరవైనాలుగు గంటల క్రితం ఏం జరిగిందో చెప్పేదెవరు?ఆ ముడి విప్పేదెవరు?

                     ***
హోంమినిస్టర్ కార్యాలయం
చలిలో చెమటలు పట్టించే వాతావరణం నెలకొనివుంది.
హోంమినిస్టర్,డిజిపి కమిషన్ డిసిపి వున్నారక్కడ.
“అసలు నార్త్ అవెన్యూ లో  ఏం జరుగుతుంది?మీడియా మన చేతగానితనం మీద దుమ్మెత్తి పోస్తుంది.ప్రజలు నిరసనలు మొదలుపెట్టారు.సియం అర్థరాత్రి నన్ను పిలిచి నిలదీశారు.శాంతిభద్రతల సమస్య మొదలైతే పరిస్థితి ఏమిటి? నార్త్ అవెన్యూ మీద వచ్చిన కంప్లైంట్స్ కు మనదగ్గర పరిష్కారం లేదా? హోంమినిస్టర్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు.
“సర్  ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది”డిజిపి ఎదో చెప్పబోయాడు.
” ఎన్నాళ్ళు జరుగుతుంది?ఎన్నేళ్లు జరుగుతుంది?మనచేతిలో అధికారం వుంది.బలం వుంది.చట్టం వుంది…కానీ దానితోపాటు చేతగానితనం ఉందని మీడియా నిందిస్తోంది.చూడండి…’అంటూ తన ముందు వున్న పేపర్ ను ముందుకు జరిపాడు.
“నార్త్ అవెన్యూ మిస్టరీని పోలీసులు చేధించలేరా? జనం నార్త్ అవెన్యూ కు బలి అవుతూనే ఉండాలా ?పరిశోధన కోసం వెళ్లిన పోలీస్ఇ అధికారులు కూడా అదృశ్యమయ్యారు.అయినా చీమకుట్టినట్టు కూడా లేని పోలీసులు…పోలీసులను ఎండగడుతూ రాసిన వార్తాకథనం..
హోంమినిస్టర్ కోపంతో ఊగిపోతున్నాడు.
అతనికి  సియం నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి,వాటిని డిజిపికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు.
“సర్..ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కు సంబందించిన  పూర్తి వివరాలు ఇందులో వున్నాయి.ఓ ఫైల్ ను హోంమినిస్టర్ కు అందిస్తూ “చనిపోయిన నాలుగు ఢిల్లీ నుంచి బయల్దేరారు.వాళ్లతో పాటు మరో అమ్మాయి ఉన్నట్టు తెలిసింది.ఆ అమ్మాయి మిస్సయింది.దాని గురించి ఎంక్వయిరీ జరుగుతుంది.వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఓ కార్ లో బయల్దేరారని తెలిసింది.ఆ కార్ నంబర్ వివరాలు తెలియాలి…రెండు రోజుల్లోగా పూర్తివివరాలు మీకు అందిస్తాను సర్? చెప్పాడు డిసిపి చతుర్వేది.
“నాకు కావాల్సింది ఫైల్స్ డిటైల్స్ కాదు సొల్యూషన్ …మీడియా నుంచి సియం నుంచి ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది.
మీరు ఎస్కేప్ అయినట్టు నేను సియం దగ్గర ప్రజల దగ్గర ఎస్కేప్ కాలేను.మీవల్ల కాకపోతే చెప్పండి.ఢిల్లీ నుంచి కత్తిలాంటి సిబిఐ ఆఫీసర్ ను పిలిపిస్తాను”వాలా వంక చూస్తూ అన్నాడు హోంమినిస్టర్.
ఎవ్వరూ మాట్లాడలేదు.హోంమినిస్టర్ ముందు వాళ్ళు ఎలా మట్లాడగలరు.కాకపోతే హోంమినిస్టర్ గురించి తెలిసిన వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.హోంమినిస్టర్ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాడని…
ఢిల్లీ నుంచి ఈ కేసు మిస్టరీని సాల్వ్ చేయడానికి వస్తున్నాడు. సిట్ ఆఫీసర్ గా..మీరు అతనికి కోపరేట్ చేస్తే చాలు…’అంటూ లేచాడు హోంమినిస్టర్..మీరిక వెళ్లొచ్చు అన్నట్టు.
                                                              ***
డిజిపి ఆఫీస్
కమీషనర్ డిసిపి చతుర్వేది వున్నారు.
హోదాల్లో కొద్దిపాటి తేడాలున్నట్టే బాచ్ లో చిన్న తేడాలు.ముగ్గురూ మంచి ఫ్రెండ్స్ కూడా…
“హోంమినిస్టర్ గారు మనల్ని నమ్మడం లేదు కదూ”డిజిపి అన్నాడు.
‘మీకు తెలియనిదేముంది..పొలిటికల్ ప్రెజర్స్ ,దానికితోడు ప్రజల్లో నిరసనలు…ప్రతిపక్షాలకు అసెంబ్లీలో నిలదీయడానికి మంచి అవకాశం.నిజం చెప్పాలంటే ఇది మనక్కూడా ఒక మంచి అవకాశం.నార్త్ అవెన్యూ మిస్టరీని మనం గత చాలా కాలంగా చేధించలేకపోయాం.”కమీషనర్ అన్నాడు.
“కానీ ఈ కేసును పరిశోధించడానికి మనవాళ్ళు దొరకలేదా?ఎక్కడో ఢిల్లీ నుంచి పిలిపించాలా?కాసింత బాధ ధ్వనించింది డిజిపి గొంతులో.
“సర్ ఈ కేసును పరిశోధించడానికి వస్తున్నది ఎవరో తెలిస్తే అందరికన్నా మీరే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు.”డిసిపి చతుర్వేది అన్నాడు.
‘వాట్ ఈ కేసును సాల్వ్ చేయడానికి,సంవత్సరాలుగా మిస్టరీగా మారిన నార్త్ అవెన్యూ చీకటిరహస్యాన్ని చేధించడానికి వస్తున్నదెవరో మీకు తెలుసా?
“తెలుసు “అన్నట్టు తలూపి “మీక్కూడా తెలుసు సర్”చిన్నగా నవ్వి చెప్పాడు.
“ఎవరతను…తనో డిజిపి అన్న విషయం మరిచి చిన్నపిల్లాడిలా అడిగాడు కుతూహలాన్ని ఆపుకోలేక…”
“ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ కేసును ఇరవైనాలుగు నాలుగు గంటల్లో చేధించిన బాంబు కన్నా మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్,ముంబై లో అండర్ వరల్డ్ మాఫియాను మట్టి కరిపించి,అండర్అ వరల్డ్ డాన్ ను విదేశాల్లో తలదాచుకునేలా;,విదేశాలకు పారిపోయేలా చేసిన వ్యక్తి,
మన తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమ్మాయిల కిడ్నాప్ రాకెట్ ను నేలమట్టం  చేసి,తర్జని అనే అమ్మాయి మిస్టరీ కేసును సాల్వ్ చేసి,పోలీసులను మూడుచెరువుల నీళ్లు తాగించిన విక్కీని ఎన్కౌంటర్ చేసిన అసలు సిసలు తెలుగువాడు..సివిల్ సర్వీసెస్ లో టాప్ ర్యాంకర్…మన తెలుగువాడు….ముక్కుసూటిగా వెళ్లడం మంచికోసం ప్రాణం ఇవ్వడం…అతని నైజం.రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులు అతని వర్తించవు.
ఒక్కమాటలో చెప్పాలంటే ..
గాలిని చీల్చే పదునైన ఆయుధం
అరాచకాలపై నిప్పులువెదజల్లే అగ్నివర్షం ..
అతనే ఏకవ్యక్తి సైన్యం
నార్త్ అవెన్యూ మిస్టరీని చేధించే మిస్సయిల్…
ఆపరేషన్ డెత్ సెంటెన్స్ ను ఫినిష్ చేసిన వన్ మేన్ ఆర్మీ   అ…ని…రు…ద్ర….
                                         ***
(నార్త్ అవెన్యూ లోకి అనిరుద్ర ఎంటర్ అవ్వబోతున్నారు.వచ్చేవారం వరకూ.బీ అలర్ట్ …)
nepathyam3
ఆపరేషన్ డెత్ సెంటెన్స్ గురించి అనిరుద్ర చేసిన సాహసాల గురించి తెలుసుకోవాలంటే “డెత్ సెంటెన్స్ ‘నవల చదవొచ్చు.మీ కోసం ఆ నవల లింక్ …
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY