స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటి నేను (26-02-2017)

(గత సంచిక తరువాయి…)
సోమవారం…
నేను కొన్న డ్రామా బుక్స్ ని మరిచిపోకుండా స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరాను.
డ్రామా టైం లంచ్ తరువాత…
లంచ్ వరకు టైం గడిపి ఎలానో లంచ్ ముగించుకుని లైబ్రరీ చేరాను.
మా డ్రామా ప్రాక్టీస్ 3 గంటలకు ఉండడంతో 2 గంటలకు లైబ్రరీలో అడుగుపెట్టాను.
అప్పటికే చినబాబు, అతని గ్యాంగ్ కూర్చుని ఉన్నారు.
నెమ్మదిగా వెళ్లి నా చేతులోని డ్రామా బుక్స్ ని అతనికి అందించాను.
అతను తన పక్కన ఉన్న అతని ఫ్రండ్ కి ఆ బుక్స్ హ్యాండ్ ఓవర్ చేశాడు.
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ లా వాళ్ళ ముందు నిలబడ్డాను
***
మా జూనియర్స్ కి స్క్రిప్ట్ చదవడం ఎంత మాత్రం వచ్చో తెలియదు కాని. స్క్రిప్ట్ తీసుకున్నవాడు మాత్రం తెగ చదివేస్తున్నాడు.
10 నిముషాలు భారంగా గడిచాయి.
వీడి రియాక్షన్ తగలెయ్య… ఇక్కడ బీపీ పెరిగిపోతోంటే అక్కడ నింపాదిగా చదువుతున్నాడేమిటో…
వాడు మొత్తం చదివి తలపైకెత్తాడు. అతడు ఏమి చెప్తాడో అన్న టెన్షన్.
నాతో పాటు చిన్నబాబు అండ్ టీం కూడా అతని వంక ఏమి చెప్తాడో అన్నట్టు చూశారు.
అతని రియాక్షన్ కాస్త ప్లెజంట్ గా ఉంది.
దానితో అందరికన్నా ముందు నేను రిలాక్స్ అయ్యాను.
నేను తెచ్చిన డ్రామా పాస్ అయ్యింది. ఆనందంతో మనసు తాండవం చేస్తోంది.
నేను కూడా డైరెక్టర్ కావచ్చు అన్న ఖుషీ నన్ను ఒక్కచోట నిలవడంలేదు.
డ్రామా సెలక్షన్ కావడంతో చిన్నబాబు పార్టి అరేంజ్ చేశాడు.
డబ్బున్న వారి పార్టీ అంటే కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఎవరికెంత కావాలో ఎన్ని కావాలో అన్ని అందుబాటులో పెట్టారు.
క్లాస్ ఎగ్గొట్టి (చినబాబు ఎఫెక్ట్, క్లాస్ మిస్ అయినా అడిగేవారు ఉండరు) మరీ పార్టీ స్టార్ట్ చేశారు.
***
మా డ్రామా ఎలా స్టార్ట్ అయ్యిందో ఆ కాన్సెప్ట్ ఫాలో అయ్యి డ్రామా స్క్రిప్ట్ రెడీ చేశాను.
ప్రతి రోల్ కి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి డైలాగ్స్ ఇచ్చాను. వాళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి వాళ్లకు తగ్గట్టు రోల్స్ సెట్ చేసి సెలెక్ట్ చేశాను.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY