వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి డబుల్ హ్యాట్రిక్ సీరియల్…శ్రీ&శ్రీమతి. భార్యాభర్తల మధ్య వుండే సున్నితమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ తో,హాస్యం కలగలిసి,అల్లరి మేళవించి కొనసాగే ఈ సీరియల్ మీద మీ స్పందన తెలియజేయండి…చీఫ్ ఎడిటర్
ప్రారంభానికి ముందు…
ప్రేమకు అర్థమేమిటి?
దాంపత్యానికి నిర్వచనమేమిటి?
కన్నీటిని తర్జుమా చేసే యంత్రముందా?
విషాదాన్ని మాయం చేసే మంత్రముందా?
గడిచే కాలాన్ని శిథిలమయ్యే జ్ఞాపకాలను ,పదిలపర్చే చోటెక్కడ?
నాకే అర్థం కానీ ప్రశ్నకు,సమాధానం చెప్పే మనిషెక్కడ?
***
నగరానికి వణుకు తగ్గలేదు
సూర్యుడింకా డ్యూటీ మొదలవ్వలేదు
వణికించే చలిలో మార్నింగ్ వాక్ చేసేవాళ్ళతో ఆ గ్రౌండ్ చిత్రకారుడు గీసిన వర్ణచిత్రంలా వుంది.
కూసింత కూతవేటు దూరంలో…
ట్రాక్ సూట్లో ఓ అమ్మాయి …
లుంగీ బనియన్ మీద ఓ అబ్బాయి ..
జాగింగ్ చేస్తున్నారు .ఆమె జాగింగ్ చేస్తే,అతను జాగింగ్ చేసినట్టు నటిస్తున్నాడు.
ఆ అమ్మాయి మొహం లో ఫ్రెష్ నెస్ కనిపిస్తుంటే , ఆ అబ్బాయి మాత్రం ఇంకా నిద్ర తాలూకూ మత్తు వదలనట్లు కళ్ళు మూసి తెరుస్తున్నాడు.తన నిద్రను డిస్ట్రబ్ చేసినవాళ్లకు మనసులోనే శాపాలు పెడుతున్నాడు.
మద్యమద్యలో అతనిని గమనిస్తుందామె .
ఏయ్… చరణ్ ..కమాన్ …ఆరోగ్యానికి జాగింగ్ ఎంత మంచిదో తెలుసా …
అంటూ అతన్ని ఎంకరేజ్ చేయాలని విఫల ప్రయత్నం చేస్తుంది .
“చూడు చందనా… ఈ ప్రపంచం లో నాకు తెలిసి ముగ్గురే శాడిస్టులు వున్నారు .
వాళ్లెవరో తెలుసా “ఆయాసం తో రొప్పుతూ అడిగాడు చరణ్.
“ఎవరు?” కనుబొమ్మలు ముడివేసి అడిగింది జాగింగ్ చేస్తూనే.
హిట్లర్… ఈది ఆమీన్…అంటూ ఆగాడు చరణ్ .
“మూడో వ్యక్తి ?” అడిగింది చందన.
(ఆ మూడవ వ్యక్తి ఎవరో గెస్ చేయగలరా?కొనసాగింపు వచ్చేసంచికలో )
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్