విషయం మా డ్రామా సర్ కి తెలుస్తే అందరిని తోలు వలుస్తాడని తెలిసినా ఎందుకో నవ్వు ఆపుకోలేకపోయేవాళ్ళం స్మార్ట్ రైటర్ సురేంద్ర నిన్నటి నేను (09-04-2017)

(గత సంచిక తరువాయి…)
ఒక సంస్కృత డ్రామా చూడడం ఎంతో తృప్తి కలిగింది అనడంలో సందేహం లేదు. మా సర్ పుణ్యమా అని పెద్ద పెద్ద వారితో పరిచయభాగ్యం కలిగింది. వారికి నేను తెలియకపోయినా వారి నుండి ప్రేరణ దొరికింది. మా పెద్ద డ్రామాలో మంచి పట్టు దొరికింది. డ్రామా మొత్తం ఒక గంట వరకు వచ్చేలా మేనేజ్ చేయడం జరిగింది.
డ్రామాలో ఒక డాన్స్ సీన్ ఉంది. ఇంద్రుడి ముందు డాన్స్ చేసే అప్సరసలు ఉండే సీన్. అది దాదాపు పది నిముషాలు ఉంటుంది. అందులో ఒక చరణంలో “కాలువ గట్లు, కొబ్బరి చెట్లు” అనే లైన్ ఉంది. ఆ లైన్ వచ్చినప్పుడల్లా మాకు నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైయ్యేది. కారణం… డాన్స్ చేసే అమ్మాయిలలో ఒక అమ్మాయి చాలా పొడవుగా ఉంటుంది. కొబ్బరి చెట్లు అన్న లైన్ రాగానే చేసే అభినయం చూస్తే… ఆ నిజంగానే కొబ్బరిచెట్టులా కనిపించేది మాకు. ఆ అమ్మాయి మా వంక కొరకొరా చూసేది. మేము నవ్వే విషయం మా డ్రామా సర్ కి తెలుస్తే అందరిని తోలు వలుస్తాడని తెలిసినా ఎందుకో నవ్వు ఆపుకోలేకపోయేవాళ్ళం. ఆయనకు కనపడకుండా నవ్వును ఆపుకోవడానికి ఎన్నో తంటాలు పడేవాళ్ళం.
డ్రామాలో నాదే ఫస్ట్ అండ్ లాస్ట్ సీన్ కావడంతో మా సర్ కి నేను ఎలా చేస్తానో అన్న కంగారు ప్రతి ప్రాక్టీస్ సెషన్ లోను ఆయన పేస్ లో కనపడుతుంది. నాకు ఏ మాత్రం కంగారు లేదు, రాదు..
అలాగే మైమ్ డ్రామాలో కూడా మంచి పట్టు దొరికింది. ప్రతి సీన్ అలవోకగా చెయ్యడం స్టార్ట్ అయ్యింది.
ఇలా ఉండగా ఒక రోజు మా సర్
“మనం పబ్లిక్ లో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం” అన్నాడు.
“పబ్లిక్ లోనా?”
“అవును”
పబ్లిక్ లో ఇంతవరకు ప్రాక్టీస్ చేసి ఎరుగను. స్టేజి పైన చెయ్యడం వేరు పబ్లిక్ లో చెయ్యడం వేరు.
స్టేజి పైన అంటే చూసేవారికి, చేసేవారికి దూరం ఉంటుంది. పైగా ఒక కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. అదే పబ్లిక్ లో అయితే ఆ ఫెసిలిటీ ఉండదు. పైగా అందరూ చాలా క్లోజ్ గా ఉంటారు.
“సర్… ఏమనుకోకుండా ఉంటే ఒక్క మాట” నసుగుతూ అన్నాను
ఏమిటి అన్నట్టు చూశాడు.
“డ్రామా స్టేజి పైన ఫస్ట్ టైం చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ముందుగా చూపించేస్తే తరువాత వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుందేమో…” మెల్లగా అయినా క్లియర్ గా చెప్పాను
“ఏమి పరవాలేదు. మన డ్రామా ఎలా ఉందో పబ్లిక్ టాక్ తెలుస్తుంది. పైగా మనం మొత్తం చెయ్యడం లేదు. సినిమా ట్రైలర్ లా చూపిస్తాం. దానితో ఇంట్రెస్ట్ పెరిగి నెక్స్ట్ ఏమి అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పైగా మనకు పబ్లిసిటీ వస్తుంది”
మా సర్ సినిమాలో ఎందుకు చేరలేదో నాకు అర్థం కాలేదు. ఇంత నాలెడ్జ్ ఉన్న మా సర్ సినిమాలో చేరితే ఇక ఏ సినిమాకైనా పబ్లిసిటీకి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు అనిపించింది
ఈవెనింగ్ బ్రేక్ లో ఒక క్లాస్ లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం.
మొదట అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మేం చేస్తున్నది ఏమిటో అర్థం కాలేదు.
ఫస్ట్ సీన్ చేయగానే ఒక్కసారి ఘోల్లుమని నవ్వారు. ఆ సందడి చూసి పక్క క్లాస్ వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుందని అనుకుంటూ వచ్చి అక్కడ ఉన్న గ్రూప్ లో చేరిపోయారు.
ఒక ప్రక్క మేం పెర్ఫార్మన్స్ చేస్తున్నా నేను పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో గమనించడం స్టార్ట్ చేశాను.
ఇలాంటి డ్రామా ఇంతవరకు ఎవరూ చేయకపోవడం, పబ్లిక్ లో ఎవరూ చూడకపోవడంతో వాళ్లకు వింతగా కొత్తగా ఉంది. ప్రతి సీన్ కి పగలబడి నవ్వుతున్నారు.
వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మేం చేస్తున్నది ఆపడం సాధ్యం కావడం లేదు. మా సర్ అయితే నన్ను మించి ఉత్సాహంతో రెచ్చిపోయి చేస్తున్నాడు.
పబ్లిక్ రియాక్షన్ అదిరిపోతోంది. చివరకు అక్కడ ఏదో గలాటా జరుగుతుంది అని టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ రావడంతో ఇక తప్పదు అన్నట్టు ఆపేశాం.
మేం డ్రామా మద్యలో ఆపేయడం వల్ల కలిగిన నిరాశాపూరితమైన వాతావరణం, స్టూడెంట్స్ పేస్ లో నిరుత్సాహంతో మా డ్రామా గ్రాండ్ సక్సెస్ అని తెలిసిపోయింది.
మా సర్ పేస్ లో ఎప్పుడూ చూడనంత సాటిస్ ఫాక్షన్.
నా అంచనా తప్పైనా మా డ్రామా పబ్లిక్ లోకి వెళ్ళింది. మా డ్రామా గురించి స్కూల్ లో టాక్ మొదలైంది అన్న విషయం చాలా సంతోషం కలిగించింది.
ఇక స్టేజి పైన ఫుల్ మేకప్ తో డ్రామా చూపిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటే ఆ నైట్ సంతోషంతో నిద్ర పట్టలేదు.
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY