ఇంత అర్ధరాత్రి వచ్చింది ఎవరై వుంటారో బోధపడలేదు. తలుపు తెరవగానే పోలీసులు…!! విజయార్కె…సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(09-04-2017 )

(3)
ప్రారంభం
19 మే1985
అర్ధరాత్రి 11 .30 దాటింది.
ఆ రోజే బి. ఎల్ . వి ప్రసాద్ గారి ‘ఇద్దరు మిత్రులు’ షూటింగ్ చేసి వచ్చారు. చాలా అలసటగా వుంది.
కళ్ళు బరువుగా అనిపించసాగాయి. క్షణం తీరిక లేకుండా షూటింగ్.
ఒక్క క్షణం డబుల్ కాట్ మీద పడుకున్నారు. ఎ.సి చల్లదనం ఆ గదినంతా పరుచుకుంది.కళ్ళు మూతలు పడుతున్నాయి.
తెల్లారితే మళ్ళీ షూటింగ్.
లైఫ్ అంతా బిజీ.
ఆలోచిస్తుంటే ఒక్కోసారి బోర్ , మరోసారి ఇంట్రెస్ట్.
అప్పుడప్పుడు నిద్రపడుతుంది.
టైం పన్నెండవుతుంది. బయట కుక్కలు అరుస్తున్నాయి.
ఇంతలో తలుపులు మీద ఎవరో బాటనా చప్పుడు.
సుమన్ తల్లిగారికి మెలకువ వచ్చింది.
అప్పటివరకూ షూటింగ్ తో అలసిపోయి వచ్చిన కొడుకును డిస్టర్బ్ చేయదల్చుకోలేదు.
తనే లేచింది. లైట్స్ వేసి తలుపులు తెరిచింది.
ఇంత అర్ధరాత్రి వచ్చింది ఎవరై వుంటారో బోధపడలేదు. తలుపు తెరవగానే పోలీసులు…!!
ఇంత అర్ధరాత్రి వేళ పోలీసులు తమ ఇంటికి రావడమేమిటి? ఆశ్చర్యం, భయం, అనుమానం….ఎన్నో భావాలు.
తన బెడ్ రూంలో డబుల్ కాట్ మీద పడుకొని తెల్లారి తీయబోయే సీన్ గూర్చి ఆలోచిస్తున్నాడు సుమన్.
బయట ఎవరో తల్లితో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఇంత అర్ధరాత్రివేళ ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళాడు.
‘ఏమిటి ఇన్ స్పెక్టర్, వాటీజ్ ద మ్యాటర్?” అడిగాడు సుమన్.
”మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టినట్టు మాకు ఇన్ ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంటిని సోదా చేయాలి” చెప్పాడు ఇన్ స్పెక్టర్.
బయటకి తొంగిచూశాడు సుమన్. కానిస్టేబుల్స్ చాలామందివున్నారు. వాళ్ళ చేతుల్లో రైఫిల్స్.
కొందరు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చేశారు.తలో మూలకు వెళ్లి ఇంట్లో వెతకసాగారు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, బెడ్
రూమ్ అన్ని వెతుకుతున్నారు.
ఇదంతా ఏమిటో అర్ధం కావడం లేదు! అంతా కంగారు, గడబిడ, గందరగోళం.
క్షణాలు…ఒక్కో క్షణం ఒక్కో ఫీలింగ్….
”మరొకసారి పొలిసు స్టేషన్ కు రావాలి” ఇన్ స్పెక్టర్ కంఠం ఖంగుమంది. అప్పటికే సోదా పూర్తయింది. బాంబులు ఏవీ లేవు.
”ఎందుకు?” అడిగింది సుమన్ తల్లి.
సుమన్ వైపు తిరిగి చెప్పాడు ఇన్ స్పెక్టర్ ”మీతో పనివుంది”
”రేపు మార్కింగ్ వస్తాను” చెప్పాడు సుమన్.
”లేదు. ఇప్పుడే రావాలి. జస్ట్ కొద్దిసేపే. తర్వాత మీరెళ్ళిపోవచ్చు?” ఇన్ స్పెక్టర్ చెప్పాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా.
”వచ్చింది పోలీసులు. వెళ్ళకపోతే బావుండదు. కానీ ఇంత అర్ధరాత్రివేళ తను వెల్లడమేమిటి?” తనలో తానూ అనుకున్నాడు.
కానీ వెళ్ళక తప్పదు. వెళ్ళాలి.
”పదండి” అన్నాడు సుమన్
”బాబూ!” తల్లి వారించబోయింది.
ఎందుకో ఆమె సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరిస్తున్నట్టనిపించింది!
* * *

(సుమన్ ని అరెస్ట్ చేసారా? మిగితా వచ్చేవారం)

సైకిల్ సరదా!
చిన్నప్పుడు నాకు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉండేది. రోజూ మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా అద్దె సైకిల్ తీసుకొని స్నేహితులను వెంటేసుకుని సైకిల్ నేర్చునేవాడిని. ఒక్కరోజులోనే సైకిల్ తొక్కడం నాకు వచ్చేసిందనే నిర్ణయానికి వచ్చేశాను. మరుసటి రోజు ఎవరూ లేకుండా ఒక్కణ్నే అద్దె సైకిల్ తీసుకుని ఎక్కాను. అది నా ప్రమేయం లేకుండానే ముందుకు కదిలింది.
నాకు బ్యాలెన్స్ తప్పింది. సరాసరి వెళ్లి అది ఓ కాల్వలో పడింది. ఆ సైకిల్ ని,నన్ను బయటకి తీసేసరికి గంట పట్టింది. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఇంట్లో నన్ను మరో గంట వీపుమీద వాయించారు (ఆ తర్వాత నాకు మరో సైకిల్ కొనిచ్చారులెండి. అది వేరే విషయం)
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
జైలు గోడల మధ్య హీరో సుమన్…ఫ్లాష్ బాక్ 1991
వచ్చేవారమే ప్రారంభం
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 )ప్రాంతంలో ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

http://preview.kinige.com/previews/7800/PreviewJailuGodalaMadhyaHeroSuman36533.pdf

NO COMMENTS

LEAVE A REPLY