8
దాదాలు, రౌడీషీటర్స్, డ్రగ్స్ అమ్మేవాళ్ళు-ఇలాంటి వాళ్ళని ఉంచే సెల్ అది. అందులో సుమన్ ని ఉంచారు. ఆ రోజుకూడా నిద్రకు దూరమయ్యాడు సుమన్.
బలవంతంగా నిద్రపోవాలన్నా జరిగిన సంఘటనలు అతనిలో ప్రశాంతతని దూరం చేస్తున్నాయి.
తరచుగా సెల్ మార్చేవాళ్ళు.
దానివల్ల రోజూ కొత్త పరిచయాలు.
ఒక్కో సెల్ లో నలుగురు నుండి ఏడుగురు వరకూ ఉండేవారు. సుమన్ సెల్ గ్రౌండ్ ఫ్లోర్ లో వుంది.
డైనింగ్ టేబుల్ ముందు, ఖరీదైన ప్లేట్లలో బ్రేక్ ఫాస్ట్ చేసిన తను సత్తు పళ్లెంలో తినడం మర్చిపోలేని అనుభవం, అలాగే అన్నం కూడా. అసలు ఆ వాతావరణంలో ఇమడడానికి సుమన్ చాలా కష్టపడవలసి వచ్చింది.
రోజూ క్యూలో నిలబడ్డం.
ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సుమన్ ను తరచూ సెల్ మార్చడంవల్ల ఓ విధంగా మంచి జరిగిందనే చెప్పాలి.
ఇదే విషయాన్ని సుమన్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ”వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళలో రకరకాల నేరాల మీద వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళు కోర్టులో ఎలా మాట్లాడాలి? కోర్టులో ఎలా ప్రశ్నలడుగుతారు ? లాంటి విషయాలు చెప్పేవారు.
అంతేకాదు, ఒక్కోసారి వాళ్ళను చూస్తుంటే ఆశ్చర్యం కలిగేది నాకు. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా వుంటారా? అసలు నేరాలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? అనే విషయాలు సమాజంపట్ల అవగాహన చాలావరకు వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను.
అక్కడ కూడా అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలు జరిగేవి. కానిస్టేబుళ్ళందరి ముందు కొట్టినా రాయిలా వుండేవారు. అసలు గట్స్ అంటే ఏమిటో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అంతేకాదు దెబ్బతిన్న మనుషుల్లో ప్రతీకారం ఎలా వుంటుందో కళ్లారా….చూశాను.”
ఆ రోజూ మే 23
ఆ రోజు ఏం జరిగింది?
(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.
manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman