మొబైల్ ఫోన్ సౌకర్యం లేని రోజుల్లో మేము ఉన్న చోటులో ఏమి జరుగుతుందో ఇంట్లో వారికి తెలియని పరిస్థితి….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (25-06-2017)

(గతసంచిక తరువాయి)
ఎలాగో కాస్త ధైర్యం తెచ్చుకున్నాం. ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ ఒక్క దయ్యం ఏమి చేస్తుందనే ఊహ రావడంతో ధైర్యం మరి కాస్త పెరిగింది. అలా కావడంతో ఇక ఇక్కడే ఉండలేక మరింత దగ్గరకు వెళ్లాం.
తీరా దగ్గరకు వెళ్లేసరికి అక్కడ జరిగే తంతు చూసి నవ్వు ఆపుకోలేకపోయాం. మా జూనియర్ అమ్మాయిలు కొంత మంది కోనేటి మీదుగా కొండ ఎక్కడానికి ట్రై చేశారు. అందులో కొంతమంది ధైర్యంగా పైకి ఎక్కారు. మరికొంత మంది సగం వరకు కొండ ఎక్కి భయంతో ఆగిపోయారు. అక్కడ నుండి క్రిందకు చూస్తే కళ్ళు తిరిగే పరిస్థితి. అలా చూడడంతో ఒక అమ్మాయి భయంతో అక్కడే కూర్చుని కేకలు వేయడంతో అవి మాకు వినపడ్డాయి. మాకు అప్పుడు అర్థం అయ్యింది, స్కూల్ యూనిఫారంలో భాగంగా అందరం వైట్ డ్రెస్ వేసుకున్నాం. అదే వైట్ డ్రెస్ చూడడంతో మాకు దెయ్యంలా కనపడి భయం వేసింది. పైగా ఆ అమ్మాయి జుట్టు విరబోసుకుని మమ్మల్ని మరింత భయపెట్టింది.
మా పి.ఇ.టి. సర్ కింద నుండి ఆ అమ్మాయిని అరుస్తూ కిందకు రమ్మని చెప్పడంతో మరింత భయపడిపోయింది. ఇంతలో మరో సర్ కొండ పైకి ఎక్కి ఆ అమ్మాయిని జాగ్రత్తగా కిందకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అప్పటికే సాయత్రం 4 గంటలు అయ్యింది. ఇక రిటర్న్ కోసం అందరూ రెడీ అవుతున్నారు. క్లాస్ ప్రకారం అందరిని గ్రూప్స్ గా కూర్చోబెట్టారు. మద్యాహ్నం తిన్నది ఎప్పుడో అరిగిపోవడంతో ఆకలి నకనకలాడుతోంది.
ఏదైనా స్నాక్స్ ఇస్తారేమో అన్న ఆశతో కాస్త నీరసంగా అక్కడే కూర్చున్నాం. మిట్ట మద్యాహ్నం కొండ ఎక్కడంతో వేడికి కళ్ళు మంటలు పుడుతున్నాయి. అదృష్టం కొద్దీ దగ్గరలో బోర్ ఉండడంతో కడుపు నిండుగా నీళ్ళు తాగాం.
రిటర్న్ లో అందరిని గవర్నమెంట్ బస్సులో కుక్కడం స్టార్ట్ చేశారు. ఒక్కో క్లాస్ నుండి కొంతమందిని గ్రూప్ గా చేసి బస్సులు ఎక్కించడం, వారితో ఒక టీచర్ ఎక్కడం. స్టూడెంట్స్ చాలా మంది ఉండడంతో అక్కడకు వస్తున్నా బస్సులు సరిపోవడంలేదు.
అలా టైం 6 దాటింది. చీకట్లు ముసురుకున్నాయి…
స్టూడెంట్స్ సగం మంది కూడా బస్ ఎక్కలేదు. ఇంటి వద్ద పరిస్థితి నాకు అర్థం అయ్యింది. మొబైల్, ఫోన్ సౌకర్యం లేని రోజుల్లో మేము ఉన్న చోటులో ఏమి జరుగుతుందో ఇంట్లో వారికి తెలియని పరిస్థితి. బస్ స్కూల్ వరకు వెళ్ళకపోవడంతో పేరెంట్స్ అందరూ బస్ స్టాండ్ లోనే ఉన్నారు.
మా తాతగారు ఇక లాభం లేదని నేరుగా చంద్రగిరికి వచ్చేశారు. తనతో మమ్మల్ని పంపమని టీచర్స్ తో వాదనకు దిగారు. మీ ఆర్గనైజేషన్ దరిద్రంగా ఉంది. ఇంకా ఎంతసేపు పిల్లవాళ్ళను మీ వద్దే ఉంచుకుంటారు అన్న ఆర్గుమెంట్ కి ఎ టీచర్ వద్ద ఆన్సర్ లేకుండా పోయింది. కనీసం మా పిల్లలనైనా త్వరగా పంపించండి అంటూ గొడవకు దిగారు.
మా క్లాస్ టీచర్ మా తాతగారికి సర్దిచెప్పి సముదాయించే లోపల బస్ వచ్చింది. ఇక ఆ బస్సు లో మా తాతగారితో పాటు మేము కూడా ఎక్కం.
మొత్తానికి ఎక్స్ కర్షన్ ముగించుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి చేరాం.
అప్పటికే మా అమ్మమ్మ కమ్మగా వంట చేసి ఉండడంతో మంచి ఆకలి మీద ఉన్న నేను డిన్నర్ పై పడ్డాను.
కడుపు నిండడంతో నిద్ర తన్నుకుంటూ వచ్చింది. అలసట, నీరసం, దాహం లాంటి ఈతి బాధలకు మంచి మందులా కమ్మని భోజనం దొరకడంతో రోజు తినే కన్నా కాస్త ఎక్కువే తిన్నాను.
నిద్ర పోవడానికి బెడ్ పై వాలగానే మా తాతగారు మా అమ్మమ్మతో ఇక ఏ ఎక్స్ కర్షన్ కి కూడా పిల్లలను పంపకూడదు. స్కూల్ మేనేజ్ మెంట్ సరిగా లేదు అన్న మాటలు లీలగా వినిపిస్తుండగా
ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY