చందన నిద్రలేచేసరికి చరణ్ కనిపింహలేదు.ఒక్కక్షణం మనకు చివుక్కుమంది.”వెళ్లేప్పుడు తనను నిద్రలేపి ఉండొచ్చు కదా?అనుకుంది.
చరణ్ లేకుండా జాగింగ్ కు కూడా వెళ్లాలనిపించలేదు.
***
ఆరోజు బిజినెస్ పర్పస్ లో కలవాలన్న ఫ్రెండ్స్ కలవలేదు.ఉదయం నుంచీ అలా తిరుగుతూనే వున్నాడు.ఆకలి వేసినప్పుడల్లా టీ లు తాగుతున్నాడు.సాయంత్రం అయ్యేసరికి అతనికి చందన గుర్తొచ్చింది.పరుగున ఆఫీస్ కు చేరుకున్నాడు.అప్పటికే చందన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది.
***
ఇంటికి వస్తూనే పరిస్థితిని అంచనా వేసాడు.శోకగృహంలో కోపంగా ఉందని అర్థమైంది.
“సారీ చందనా..”అంటూ అనునయించబోయాడు.పరిస్థితి వివరించబోయాడు.కానీ చందన వైన్ పరిస్థితిలో లేదు.మధ్యాహ్నం చరణ్ రాకపోయేసరికి తనూ అన్నం తినలేదు.
చరణ్ పరిస్థితి కూడా అలానే ఉంది.ఉదయం నుంచి అన్నం తినలేదు.
“పెళ్లయ్యాక మీకు నా మీద ప్రేమ తగ్గుతుంది”అంది కోపంగా చందన
“కాదు పెళ్లయ్యాక బాధ్యతలు పెరుగుతాయి…”అని చెప్పాలనుకున్నాడు..కానీ చెప్పలేకపోయాడు.
చందనను కన్విన్స్ చేసేసరికి అర్థరాత్రి దాటింది.పొద్దున్నే కలవాల్సిన ఏజెంట్స్ లిస్ట్ తయారుచేసుకున్నాడు.చందనకు ఇంకా కోపం తగ్గలేదని.ఆమె అటుతిరిగి పాడుకోవడంతోనే అర్థమైంది.ఇప్పుడు అతనేమీ ఆలోచించే పరిస్థితిలో లేదు.కర్తవ్యమ్ అతడిని అచేతనుడిగా మార్చింది కాబోలు.అందుకే భార్య ను భరించాడు.తన బాధను నొక్కిపెట్టాడు.
***
తెల్లారి అయిదు గంటలకే మెలుకువ వచ్చింది.కాస్త ఫ్రెష్ అయి వచ్చి పేపర్స్ చూస్తున్నాడు.అప్పటికే చందన లేచి వచ్చింది.రాత్రి తాలూకూ కోపం ఒకంత తగ్గినట్టు అనిపించింది.
“గుడ్ మార్నింగ్ “కాస్త భయపడుతూనే విష్ చేసాడు చరణ్
“గుడ్ మార్నింగ్”అంటూనే ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తూనే వుంటావా?పద అంది.
“ఎక్కడికి ?అడిగాడు చరణ్
“కొత్తగా అడుగుతావేం…జాగింగ్ కు”కాస్త కోపం ఆశ్చర్యం మేళవించి అంది.
“సారీ చందన…ఇవ్వాళ్టి ఉంచి జాగింగ్ రావడం కుదరదు..జస్ట్ కొన్నిరోజులు..ప్లీజ్ ఆఫీస్ పరిస్థితి బాగాలేదు..నీకు తెలుసు కదా? అన్నాడు.
“ఆఫీస్ విషయాలు ఇక్కడ వద్దు..మీరొస్తున్నారంతే ” మొండిగా అంది చందన
“అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు చందనా? అనునయంగా అన్నాడు చరణ్
“అర్థం చేసుకునేవాళ్లే అర్థం చేసుకుంటారు.నిన్ను అర్థంచేసుకునేంత తెలివితేటలు నాకు లేవు”అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది.
ఈ పరిస్థితుల్లో చందనకు ఏం చెప్పినా అర్థం కాదని,అర్థం చేసుకునే స్థితిలో లేదని అర్థమైంది చరణ్ కు.
“ఇప్పుడు కంపెనీని కాపాడే బాధ్యత ముఖ్యం.చందనకు తర్వాత నచ్చచెప్పుకోవచ్చు”
అలా అనుకుని ఓ సారి చందన వంక చూసి బయటకు నడిచాడు చరణ్.
మిగితా వచ్చేవారం
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్