నగరాన్ని కప్పేసిన మంచు ఇంటిముఖం పట్టింది…పాఠకుల అభినందనల వర్షంలో ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం

2
చలిదుప్పటి చుట్టుకున్న నగరం బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది.
నగరాన్ని కప్పేసిన మంచు ఇంటిముఖం పట్టింది
అప్పుడే తనకు తెల్లవారిందా అనుకున్న విభాకరుడు ఓరగా లోకాన్ని చూస్తున్నాడు.
సెల్ ఫోన్ లో సెట్ చేసిన అలారం “ప్లీజ్ వేకప్”అంటూ బ్రతిమిలాడుతుంది.
పద్దెనిమిదేళ్ల ప్రతిమ మెలిగా తలమీదుగా కప్పుకున్న దుప్పటిని కూసింత తొలిగించి,”అబ్బా ఊరుకోవే….మమ్మీ నిద్రలేస్తుంది.నా దుంప తెంచుతుంది”అంది ముద్దుగా విసుక్కుంటూ…
అప్పుడే సునామీలా వచ్చింది సుగాత్రి “ప్రతిమా…లేరా చిట్టితల్లీ “అంది.
“తల్లీ ..ఈ చిట్టితల్లిని కాసేపు పడుకోనివ్వు”దుప్పటి తొలగించకుండానే అంది ప్రతిమ
“అదేం కుదరదు…మొన్న రెండవ శనివారం అన్నావు..నిన్న సండే హాలిడే కదా మమ్మీ అన్నావు…అయినా జాగింగ్ చేస్తే చక్కగా ఫిట్ గా ఉంటావు..మైండ్ ఫ్రెష్ అవుతుంది”
“అబ్బా నువ్వు మమ్మీవి కాదు…హాలీవుడ్ సినిమా మమ్మీవి…పాపం కూతురు కదా,హాయిగా పడుకోనివ్వు..”అనుకోవచ్చుగా…అయినా నీ పక్కన వస్తుంటే అందరూ నిన్నే చుస్తునారు..మీ మమ్మీ సంతూర్ సోప్ వాడుతోందా అంటున్నారు..”దుప్పటి తొలిగించి బుంగమూతి పెట్టి అంది.
“నేను ఓల్డ్ నువ్వు గోల్డ్ రా”అంది కూతురిని లేపుతూ..
ఇది ఆ ఇంట్లో నిత్యకృత్యం
పొద్దున్నే తల్లీబిడ్డలు జాగింగ్ కు వెళ్లారు.
***
ఇద్దరూ ట్రాక్ సూట్ లో వున్నారు…
గ్రౌండ్ లో వెళ్తుంటే అందరి కళ్ళు వీళ్ళ మీదే. జాగింగ్ చేస్తూనే తల్లి వైపు తిరిగి”మమ్మీ నువ్వు వైట్ హెయిర్ డై వేసుకో…లేకపోతె నాకన్నా నువ్వు స్మార్ట్ గా కనిపిస్తున్నావు..నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంటే “మీ అక్క భలే వుంది”అన్నారు..”నవ్వుతూ అంది ప్రతిమ
“బంగారం నీకు అల్లరి ఎక్కువవుతుంది..బుద్ధిగా పరుగెత్తు…”ముద్దుగా కూతురిని విసుక్కుంది
వాళ్ళు ఆలా జాగింగ్ చేస్తుంటే వెనగ్గా ఓ కామెంట్ వినిపించింది”సూపర్ ఫిగర్స్ రా” అని.
సుగాత్రి ఆగి కూతురి వైపు చూసి “నువ్వు వెళ్ళరా..నాక్కాస్త చిన్న పని వుంది “అంది.ప్రతిమకు తల్లి మాటలు అర్థమై ముందుకు కదిలింది.పది నిమిషాల తర్వాత కూతురి దగ్గరికి వచ్చింది.ఇద్దరూ ఓ చెట్టు కింద కూచున్నారు.
“ఇద్దరి పొజిషన్ ఎలా వుంది?హాస్పిటల్ లో జాయిన్ చేసావా? అడిగింది తాపీగా ప్రతిమ తల్లిని.
“హాస్పిటల్ ఏమిటి?ఏమీ తెలియనట్టు అడిగింది.
తల్లి మెడచుట్టూ చేతులేసి.”ఏం జరిగిందో షాట్ టు షాట్ చెబుతాను…”అంది.
“ఏం జరిగిందేమిటి?అడిగింది సుగాత్రి
***
ఏం జరిగిందో మీరు గెస్ చేయగలరా?
గుప్పెడంత ఆకాశంలో చిరువిరామం
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY