ఫీడ్ బ్యాక్
మాటలు లేవు ..మాటలు చాలవు..సుగాత్రి పాత్ర నభూతో నభవిష్యతి.హేట్సాల్ప్ మేడం…మొదటిసారి చాలా కాలం తర్వాత ఒక మంచి సీరియల్ చదువుతున్నాను….విశ్వేశ్వర్రా వు (ముంబై)
సుగాత్రి లాంటి తల్లి వున్న ప్రతిమ లాంటి కూతుళ్లు అదృష్టవంతురాలు…ఏమంటారు?….. ప్రమోద.(చెన్నై)
మీరు నమ్మరు..టెక్సాస్ లో వున్న నా ఫ్రెండ్ వాట్సాప్ లో పంపించిన లింక్ చూసి గుప్పెడంత ఆకాశానికి ఫిదా అయ్యాను…శివాని ( మైసూర్)
4
ఈ ప్రపంచమొక యుద్ధక్షేత్రం…నిరంతరం యుద్ధమే..బ్రతుకుపోరులో,సమస్యల హోరులో,అకలిపోరాటంలో,అనుక్షణం కాలమనే ఆయుధంతో పోరాడే ప్రాణి మనిషి.
జననం యాదృశ్చికమే కావచ్చు…మరణం అనివార్యమే కావచ్చు..కానీ ఈ రెంటి మధ్య వున్న జీవితం కొందరికి ప్రశ్నార్థకం..?ఇంకొందరికి అగమ్యగోచరం..??.ఎవరినెప్పుడు విషాదం చెంతకొచ్చి పలకరిస్తుందో..ఎవరిని విజయం వరిస్తుందో…
రాగద్వేషాల రక్తమాంసాల అశనిరాశల అలుపెరుగని సగటుమనిషి పద్మవ్యూహంలో …నువ్వే రాజు …నువ్వే బంటు…
***
అప్పటికే సూర్యుడు చిటపటలాడిపోతున్నాడు .తన అసహనాన్నిజనం మీద నిప్పుల్లా వెదజల్లుతున్నాడు దానికి తోడు కనీసం విచక్షణ లేని వాహనాల రొద,కాలుష్యం…అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారుల క్రమశిక్షణారాహిత్యం.
సుగాత్రికి చిరాగ్గా వుంది.ఒక్కసారి హాయిగా బస్సు లో వెళ్లడమే సుఖం అనుకుంటుంది.తానొక్కర్తీ అయితే అలానే వెళ్తుంది.కూతురిని డ్రాప్ చేయడానికి అయితే వెహికల్ లో వస్తుంది.
రోడ్డు మీద జనాన్ని వెహికల్స్ చూస్తుంటే ఇదో మహా కీకారణ్యంలా అనిపిస్తుంది.జంతువుల్లో వున్న క్రమశిక్షణ మాత్రం ఇక్కడ లేదేమో…
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు..ఎవరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో..ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు..ఉద్యోగం వెతుక్కునేవాళ్ళు..కూలీకి వెళ్ళేవాళ్ళు..నేరాలు చేసేవాళ్ళు..ఆకలితో అలమటించేవాళ్ళు..ఆత్మహత్య చేసుకుందామని అనుకునేవాళ్లు…
ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు సుగాత్రిని వెన్నాడుతుంటాయి.
ప్రపంచాన్ని చదివిన అనుభవమో..
జీవితం నేర్పిన చేదు గుణపాఠమో…
రోడ్డుకు ఎడమ పక్కన ఓ వృద్ధురాలు కూచోని వుంది.ఆకలేస్తున్నట్టుంది..అడుక్ కుంటుంది.మనసు వికలమైంది.వెంటనే వెహికల్ ఆపి దిగింది.ఆ వృద్ధిరాలికి సాయం చేద్దామన్న మనసు కరువైన దృశ్యం కనిపించింది.లంచ్ కోసం తాను తెచ్చుకున్న బాక్స్ ను డిక్కీలో నుంచి తీసింది.ఆ దృశ్యం చూస్తోన్న వృద్ధ్రలి కళ్ళలో చిన్న ఆశ.అలమటించే ఆమె కడుపుకి కొండంత భరోసా….
వెంటనే తన పక్కనే వున్న ఓ చిత్తుకాగితాన్ని పరిచింది.
సుగాత్రి బాధతో కదిలిపోయింది.నెలల కిందటి చేత్తొ పేరుకుపోయిన దినపత్రిక….అందులోని వార్తకు కాలం చెల్లినట్టు….పరిశుభ్రతకు తనుదురం అన్నట్టు నణచెత్తతో సహవాసం చేసిన ఆ చిత్తుకాగితం అపరిశుభ్రమతో నిండి వుంది…
వెంటనే తన లంచ్ బాక్స్ అలానే ఇచ్చేసింది.ఆకలితో ఇక చచ్చిపోతానేమో అనుకున్న ఆ ముసలావిడకు అమృతాన్ని అందించినట్టు అనిపించింది.రెండు చేతులతో సుగాత్రి పాదాలు తాకబోయింది.
“వద్దవ్వా..నీ బిడ్డ లాంటి దాన్ని “అంది వెనక్కి జరిగి
“నువ్వు దేవతవు తల్లీ..నా బిడ్డే నన్ను రోడ్డు పాలు చేసాడు” అని చెప్పడానికి మాటలు చాలలేదు కన్నీటితోనే చెప్పింది ఆకలి ఆమె మాటలను మింగేసింది.
అవ్వ ఆబగా గబగబా అన్నాన్ని తింటుంటే ఎన్నిరోజులైందో తినక..”అనిపించింది.
వెహికల్ స్టార్ట్ చేసింది.
వెహికల్ స్టార్ట్ చేసే ముందు తన వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ పంపించింది.
ఆమె ఆశయాన్ని బ్రతికించే అక్షరానికి ఆ సందేశం చేరిపోయింది.
***
అగ్నికణం దినపత్రిక కార్యాలయం
అప్పుడే ఇంకా తెల్లవారలేదు అక్కడ..అర్థరాత్రి వరకు మెలుకువగా వుండే దినపత్రికలో మధ్యాహ్నం నుంచే సందడి.రాత్రి అయ్యిందంటే ప్రైమ్ న్యూస్ కోసం సెర్చింగ్. పత్రిక సర్క్యూలేషన్ కన్నా ,పత్రిక ఆశయమే మిన్న..అని భావించే మల్హోత్రా ఆ పత్రికాధిపతి.తన వ్యాపారాల్లో వచ్చే లాభాల కన్నా ,ఒక మంచి ఆశయంతో సమాజహితానికి పనికొచ్చే దిశలో పత్రికను పొందే నష్టం అతనికి ఒక లెక్క కాదు…అతను మానవతా విలువలను అంకెల్లోకి మార్చడానికి ఇష్టపడడు….
జర్నలిస్ట్ లు అప్పుడే రారు..సబ్ ఎడిటర్స్ తమ సీట్ల దుమ్ము దులుపుకుంటున్నారు.అందరికన్నా ముందే వచ్చిన వ్యక్తి…నందిని.
అగ్నికణం దినపత్రికలో చేరి కొన్నిరోజులు అయినా ఆమె అందించే వార్తాకథనాలు సంచలనాలను సృష్టించాయి.
ప్రెస్ మీట్స్,సినిమా కవరేజీలు ,అసలే టచ్ చేయదు.పరిశోధనాత్మక కథనాలు అంటే ఆమెకు ఇష్టం…తన పని…తాను చూసుకుంటుంది.
ఇరవైరెండేళ్ల నందిని రెండేళ్ల వయసులో చెత్తకుప్ప పక్కన ప్రాణాలతో పోరాడుతూ పడి వుంది…. ఒకవ్యక్తి ఆ చిన్నారిని హాస్పిటల్ కు తరలించి పునర్జన్మ ఇచ్చింది.ఆశ్రయమిచ్చింది…
హ్యాంగ్ బాగ్ లో నుంచి తనకు జీవితాన్నిచ్చిన వ్యక్తి ఫోటో చూస్తూ ఉండగానే ఆమె స్మార్ట్ ఫోన్ కు వాట్సాప్ మెసేజ్.వచ్చింది.
(ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది?అందులో ఏముంది? గుప్పెడంత ఆకాశంలో ఒక వారం వరకూ విరామం)
గుప్పెడంత ఆకాశంలో చిరువిరామం
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్