ఓటమితో విషాదంతో కృంగిపోయే వారిని యోధులుగా తీర్చిదిద్దే రణక్షేత్రం… మానవత్వానికి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రం…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (16 -07-2017)

                                           5

ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు అమ్మ…ప్రపంచం లేనేలేదు ఆ అమ్మ లేకపోతే….
అమ్మతనం ఒంటరితనమై…అమ్మతనం అనాథ అనే నీడలో శూన్యమై..ఆ శూన్యంలో మూర్తీభవించిన విషాదమై….దీనంగా వున్న తల్లి దీనావస్థను ఏ చిత్రకారుడు తన గుండె కుంచెతో,అమ్మ విషాద వివర్ణమయ రూపాన్ని వర్ణమయం చేయగలడు?
***
అప్పటివరకూ ఎవరిపనుల్లో వారు..ఎవరికివారే మనకెందుకు అనుకునే వారు….ఒక్కసారిగా గుమిగూడారు.కారణం అక్కడికి మీడియా వచ్చింది..దానికి కారణం అంతకన్నా ముందే నందిని వచ్చింది.
నందిని వస్తే బిబిసి వచ్చినట్టే అని మీడియాలో ప్రచారం…ఎక్కడ వార్త అవసరమవుతుందో అక్కడ నందిని ప్రత్యక్షమవుతుంది.
వార్తను వెతుక్కునే మీడియా మిత్రులు ముందు నందినిని వెతుకుతారు..ఆమెను ఫాలో అవుతారు.అది తెలిసినా నందిని తానే ముందు వార్త రాయాలని…తానే ఆ క్రెడిట్ కొట్టేయాలని అనుకోదు.ఆమెకు వార్త సంచలనం కాదు..స్ఫూర్తి దాయకం…సమాజానికి హితవచనం..వాస్తవాల నిజరూపం…
***
వృద్ధురాలి చుట్టూ కెమెరాలు..ఆమె దీనస్థితి మీద ఆరాలు…హడావుడి…వెంటనే స్వచ్ఛందసేవాసంస్థలు రంగంలోకి దిగాయి.కొన్ని మీడియా ముందు కనిపించడానికి,మరికొన్ని ఆ సంఘటనను అనుకూలంగా మార్చుకోవడానికి…ఆ వార్తను ఎలా కవర్ చేయాలా..ఎలా రేటింగ్ పెంచుకోవాలా అని చూసే ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహం….తల్లిదండ్రులను వీధుల పాలు..వృద్ధాశ్రమాల పాలు చేసిన పిల్లలను కొరడాలతో కొట్టాలని చెప్పిన రాజకీయనాయకులు…సెలబ్రిటీలు వాళ్ళ అమ్మలు నాన్నలు ఆ వృద్ధాశ్రమాల్లోనే ఉన్నారన్న ఇంగింతం విడిచి మరీ చెప్పారు.
మేరా భారత్ మహాన్….
***
ఒక ఘట్టం సమాప్తమయ్యింది..మీడియా వెళ్లపోయింది.మళ్ళీ ఆ వృద్ధాప్యపు జీవశ్చవం చెట్టు కిందే వుంది.మళ్ళీ మాములే..మరో వార్త దొరికే వరకూ…
నందిని ఈ హడావుడి అయ్యాక ఆ వృద్ధురాలిని పలకరించింది.ఆమె పిల్లల నిర్లక్ష్యాన్ని తెలుసుకుంది.
“అమ్మా నీ లాంటి అమ్మలకు ఎందరో నాన్నలకు అందరికి అమ్మ లాంటిఒక తల్లి వుంది…ఒక ఒడి వుంది.అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు..నీకు చేతనైన పని చేసుకోవచ్చు…చిన్నప్పుడు చదువుకోని చదువు నేర్చుకోవచ్చు..నీ లాంటి తల్లులకు తోడుగా ఉండొచ్చు…అక్కడికి వస్తావా?ఆ దేవాలయంలో వుంటావా?అడిగింది నందిని.
అప్పుడు గొంతు విప్పింది…మనసు విప్పింది..అప్పటి వరకూ తనో అనాథను అని చెప్పిన ఆ వృద్ధురాలు…
“తప్పకుండ తల్లీ…ఇందాకే ఒక దేవత నా కడుపు నింపింది.ఇప్పుడు మరో దేవత నాకు గూడుని ఇస్తానంటుంది….నా బిడ్డలు కాకపోయినా నా భర్త రెండో భార్య పిల్లలను పెంచాను..కానీ చట్టపరం కు వాళ్లకు ఆస్తి దక్కదన్న భయంతో నన్ను పిచ్చిదానికింద జమ చేసారు.ప్రచారం చేసారు….అందుకే రాష్ట్రం వదిలి వచ్చాను..ఎలా బ్రతికానో బ్రతుకుతున్నానో తెలియదు…నాకున్న విలువైన ఆస్తి ఇదొక్కటే “నందిని రెండు చేతులు పట్టుకుని చెప్పింది.ఆ వృద్ధురాలు ..ఆమె చేతిలో .సుగాత్రి ఇచ్చిన హాట్ ప్యాక్ వుంది.దాన్ని పదిలంగా గుండెలకు ఆన్చుకుంది.
“ఇందాక నీ కడుపు నింపిన దేవతే…నిన్ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది”కళ్ళు చెమరుస్తుండగా అంది నందిని.
ఆ వృద్ధురాలు రెండు చేతులూ జోడించింది….”అప్పుడే ఆ దేవతను చూసి అనుకున్నాను.శాపవశాత్తూ భూమ్మీద పుట్టిందని ”
ఆ వృద్ధురాలు కొన్ని దశాబ్దాల క్రిందట చెస్ ఛాంపియన్ అని ఆ క్షణం నందినికి తెలియదు…అది మొదటగా తెలుసుకున్న వ్యక్తి సుగాత్రి..
అది తెలుసుకోవాలంటే మనం ముందుకు వెళ్ళాలి.
“మనం వెళ్లే చోటు ఎక్కడికి తల్లీ..అడిగింది ఆ వృద్ధురాలు…
నందిని క్యాబ్ ను పిలిచి ఆ వృద్ధురాలిని ఆందులో కూచోబెట్టి చెప్పింది …
సుగాత్రి ఫౌండేషన్
అన్నార్తుల ఆకలి తీర్చే దేవాలయం
నిస్సహాయులకు చేయూతనిచ్చే అభయహస్తం
విధివంచితులకు నీడనిచ్చే మహావృక్షం
ఓటమితో విషాదంతో కృంగిపోయే వారిని యోధులుగా తెర్సిదిద్దే రణక్షేత్రం…
మానవత్వానికి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రం…
తమసోమా జ్యోతిర్గమయ ...
(ముంబై లో కొన్నేళ్ల క్రిందట బిక్షాటన చేస్త్తున్నఒకనాటి టాప్ మోడల్ అన్న వార్త చదివాక…మనసు తరుక్కుపోయి సృష్టించిన పాత్ర ఈ ధారావాహికలోని,వృద్ధురాలి పాత్ర ..రచయిత్రి)
గుప్పెడంత ఆకాశంలో చిరువిరామం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY