‘నా భర్త మరణానికి నువ్వే కారణం’ అంటూ సవతి తల్లి తనని నిలదీస్తుందేమో అనుకుంది.తనను…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (16 -07-2017)

చందన నిర్ణయం విన్న శివరాం ‘షాక్’ లో పడిపోయాడు. పెళ్లయి నెలలుకూడా గడవకముందే కూతురి ప్రవర్తన, కూతురి నిర్ణయం వృద్ధాప్యంలో ఆయన్ని బాధించాయి. యశోద తన మనస్సులోని ఫీలింగ్స్ ని బయటకు కనిపించనీయలేదు. తనని ఏమైనా అన్నా అంటుంది.అంతే కాదు తనను అపార్థం చేసుకుంటుంది.అది తాను భరించలేదు .సవతి తల్లి అనే ముద్ర ఎంత నరకమో తెలుసు…
* * *
స్తబ్దుగా వుండిపోయాడు చరణ్ .అతని మనసంతా బ్లాంక్ గా మారింది. వెళ్లే ముందు చందన చెప్పిన వార్త ఎంత సంతోషాన్ని కలిగించిందో చందన నిర్ణయం అంత బాధని కలిగించింది.
తను తండ్రి కాబోతున్నాడు. తన ప్రతి రూపం చందన కడుపులో పెరుగుతోంది. కానీ…తనకు దూరంగా కాదు కాదు తన మనసుకు దూరంగా వుండే నిర్ణయాన్ని చందన ఎందుకు తీసుకున్నట్టు?
ఈ ఆలోచనలన్నీ ఓ పక్కన పెట్టాడు. తన భుజాల మీద ఓ గురుతర బాధ్యత వుంది నటేశన్ రోజురోజుకూ కృంగిపోతున్నాడు.
ఇప్పుడు తను తన కంపెనీ బాధ్యతను భుజాలమీద వేసుకోవాలి.
మనసులో బాధలను, కన్నీళ్ల చాటున నొక్కి పెట్టాడు.కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు.యుద్ధం మొదలుపెట్టాక కన్నీళ్లకు భయాలకు బాధలకూ తావు లేదు/
కంపెనీకి సంభందించిన డీలర్ల. ఏజెంట్ల లిస్టును వెరిఫై చేశాడు.
* * *
మానసికంగా కృంగిపోయాడు శివరాం. నట్టింట్లో మొగుడ్ని వదిలేసి తిరుగుతున్న కూతురిగూర్చి ఏ తండ్రికి బాధ వుండదు?
అసలే అనారోగ్యం. దానికి తోడు మానసిక వ్యధ. ఆరోజు రాత్రి జ్వరంలో బాధపడుతూనే, తెల్ల్లారేసరికి ప్రాణాలు విడిచాడు పరమశివం.
* * *
అంత్యక్రియల బాధ్యత చరణ్ తన భుజాన వేసుకున్నాడు. లాయర్ వచ్చాడు. ఇంట్లో ఏడుపులు…చందన ఓ గదిలో కూచుని ఒంటరిగా ఏడుస్తోంది.మానసికంగా చివరిరోజుల్లో తండ్రిని బాధపెట్టానేమోనన్న ఫీలింగ్ కలిగింది.ఒకవిధంగా తండ్రి చావుకు తాను పరోక్ష కారణమే …కాదు తనే ప్రత్యక్ష్యకారణం.
ఒక్కక్షణం సవతితల్లిని చూసింది.మూర్తీభవించిన శోకదేవతలా వుంది.
‘నా భర్త మరణానికి నువ్వే కారణం’ అంటూ సవతి తల్లి తనని నిలదీస్తుందేమో అనుకుంది.తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటుందని అనుకుంది.సవతితల్లిని చూసింది కానీ అందులో వున్న తల్లిని చూడలేకపోయింది.
కాలం గతాన్ని మరుగున పడేస్తుంది. గాయాలను మాన్పుతుందేమో.
రాజులు భారంగా గడుస్తున్నాయి..విషాదాలను తనలో కలుపుకుని.
పదకొండవరోజు –
యశోద ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు నడిచింది. ఆమె చేతిలో చిన్న సంచి, మరో చేతిలో భర్త ఫోటో.
చందన దగ్గరకు వచ్చింది.
చరణ్ , లాయర్ పరాంకుశం వున్నారక్కడే.
”వెళ్తున్నానమ్మా” అంది.
”ఎక్కడికి?” ఒక్క క్షణం అర్ధంకాలేదు చందనకు.

మిగితా వచ్చేవారం  

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY