ఇంతలో లోపలినుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆజానుభాహువు… పెద్ద మీసాలతో గంభీరంగా ఉన్నాడు….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (16-07-2017)

(గత సంచిక తరువాయి)

రూమ్ లోకి ఎవరో పోతున్నారు… వస్తున్నారు… ఆంటీ మాత్రం నన్ను వదలడంలేదు. అక్కడ వచ్చిన పెద్దవారిని నాకు పరిచయం చేస్తోంది. నన్ను వారికి పరిచయం చేస్తోంది…
కాసేపటి తరువాత ఆంటీని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తా అంటూ పక్కకు వెళ్ళారు.
ఇదే సమయం అనుకుని ఒక్క క్షణంలో ఆ రూమ్ ఎంట్రన్స్ చేరాను.
మెల్లగా లోపలికి తొంగి చూసాను… అంతా చీకటిగా ఉంది.
లోపలి వెళ్ళాలా.. వద్దా.. అని ఆలోచిస్తూ అక్కడే నిలుచిన్నా..
ఇంతలో…
ఎవరది.. అంటూ పెద్దగా వినిపించింది.
ఒక్కసారి గుండె ఆగినంత పనైంది.
ఎక్స్ పెక్ట్ చేయని విధంగా వాయిస్ రావడంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
మాట బయటకు రాక అలానే నిలుచున్నా…
“అడుగుతుంటే పలకరేం” అంటూ మరోసారి వినిపించింది.
మాటలు పెగలక ఒక్కసారి అక్కడ నుండి పారిపోదామా అన్న ఆలోచన కలిగింది.
పారిపోతే మరో విధంగా అనుకుంటారని అలాగే ఆగిపోయాను.
ఇంతలో లోపలినుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆజానుభాహువు… పెద్ద మీసాలతో గంభీరంగా ఉన్నాడు.
నాకు గొంతులో తడి ఆరిపోయింది. మన పరిస్థితి ఏమిటో తెలియక అలానే తెల్లమొహం వేసుకుని నిలుచున్నాను.
అతను నా వంక సీరియస్ గా చూస్తున్నాడు.
ఇంతలో…
నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. తిరిగి చూస్తే మా ఆంటీ….
శివయ్యే నన్ను కాపాడడానికి ఆంటీని పంపినట్టు ఉన్నాడు అనిపించింది.
నన్ను వెదుక్కుంటూ వచ్చింది. నా ఎదురుగా ఉన్న పెద్దాయన ఆంటీని పలకరించాడు.
ఆంటీ ఆయనకు నన్ను పరిచయం చేశారు.
నా మనసులో ఉన్నది ఆయనకు అర్థం అయినట్టు ఉంది. లోపల ఏముందో చూడాలా అని అడిగారు.
నాకు భయం పోవడంతో లోపల ఏముందో అన్న ఇంట్రెస్ట్ తిరిగి మనసులో ప్రవేశించింది.
అవును అన్నట్టు తల అటూ ఇటూ ఆడించాను
నాతోరా అంటూ లోపలకు తీసుకువెళ్ళాడు. క్షణం ఆలస్యం చేయకుండా లోపలకు వెళ్లాను.
లోపల అంతా చీకటిగా ఉంది. ఒక్క కిటికీ కూడా లేకపోవడంతో వెలుతురు వచ్చే అవకాశమే లేనట్టుంది.
చీకటిలో అలవాటు ఉన్నట్టుగా స్విచ్ ఉన్నవైపుకు వెళ్ళాడు.
లైట్ వెలగంగానే ఆ వెలుతురుకి కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకున్నాయి…
కాసేపు తరువాత కళ్ళు తెరిచి చుట్టూ చూశాను.
లైట్ కి అలవాటు పడ్డ కళ్ళు చుట్టూ చూడడానికి సహకరించాయి.
అక్కడ ఉన్న వస్తువులు చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాను…

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY